Begin typing your search above and press return to search.
3 నెలల్లో నవ్యాంధ్ర తాత్కాలిక హైకోర్టు!
By: Tupaki Desk | 2 Oct 2018 4:43 PM GMTఏపీలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు లో కొంతకాలంగా జాప్యం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవ్యాంధ్రలో హైకోర్టు నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందో చెప్పాలని సుప్రీం...ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరో 3 నెలల్లో అమరావతిలో నవ్యాంధ్ర తాత్కాలిక హైకోర్టు సిద్ధమవుతుందని ఏపీ ప్రభుత్వం ....సుప్రీంకు స్పష్టం చేసింది. ప్రస్తుతం నవ్యాంధ్ర హైకోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, డిసెంబరు నాటికి పూర్తవుతాయని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్....సుప్రీంకు విన్నవించారు. హైదరాబాద్ లోనే ఇరు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటు చట్టసమ్మతం కాదని హైకోర్టు ధర్మాసనం 2015 మే 1న ఇచ్చిన తీర్పుపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
దీంతో, కేంద్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై జస్టిస్ ఏకే సిక్రీ - జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా డిసెంబరులోపు తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం సమాధానమిచ్చింది.హైదరాబాద్ లోని ప్రస్తుత హైకోర్టును ఆంధ్రకు వదిలేసి - వేరే చోట తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని - కానీ - ఏపీ సమాధానంతో ఇక ఆ అవసరం లేదని జస్టిస్ ఏకే సిక్రీ వ్యాఖ్యానించారు. అయితే, ఏపీ ప్రభుత్వం మూడేళ్లుగా ఇదే చెబుతోందని, నిర్మాణం పూర్తికాలేదని వేణుగోపాల్ అన్నారు. అందువల్ల, నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందనే అంశాలు పేర్కొంటూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.