Begin typing your search above and press return to search.

సుప్రీం ఫైర్‌: జ‌నాల చావు కోసం చూస్తున్నారా?

By:  Tupaki Desk   |   28 April 2017 3:20 AM GMT
సుప్రీం ఫైర్‌: జ‌నాల చావు కోసం చూస్తున్నారా?
X
దేశ అత్యున్న‌త వేసిన సూటి ప్ర‌శ్న‌కు రాష్ట్రాల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న దుర్మార్గ తీరుపై తీవ్రంగా మండిప‌డ‌ట‌మే కాదు.. జ‌నాల చావు కోసం రాష్ట్రాలు ఎదురుచూస్తుంటాయా? అంటూ సూటిగా ప్ర‌శ్నించి దులిపేసింది. సుప్రీంకోర్టుకు ఇంత పెద్ద స్థాయిలో ఆగ్ర‌హం ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యంలోకి వెళితే..

విప‌త్తు నిర్వ‌హ‌ణ స‌న్న‌ద్ధ‌త కోసం రాష్ట్రాలు స‌ల‌హా క‌మిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే.. వీటిని ఏర్పాటు చేయ‌టంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంతులేని జాప్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. విప‌త్తుల్ని ఎదుర్కోవ‌టానికి వీలుగా రాష్ట్రాలు క‌మిటీలు వేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు జ‌డ్జిలు ఎంబీ లోకూర్‌.. దీప‌క్ గుప్తాల ధ‌ర్మాస‌నం కోరింది. అయితే.. తాము ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో క‌ద‌లిక లేక‌పోవ‌టంపై బెంచ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

కేసు విచార‌ణ‌లో భాగంగా రాష్ట్రాలు విప‌త్తు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి స‌ల‌హా క‌మిటీలు ఏర్పాటు చేశాయా? అన్న ప్ర‌శ్న‌కు లేద‌న్న స‌మాధానం రావ‌టంతో సుప్రీం జడ్జిలు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశాయి. దేనికోసం వారు ఎదురుచూస్తున్నారు? జ‌నాలు చావాల‌ని ఎదురుచూస్తున్నారా? స‌ల‌హా క‌మిటీల్ని వేయ‌మ‌ని రాష్ట్రాల్ని ఎందుకు అడ‌గ‌రు? అంటూ సూటిగా ప్ర‌శ్నించింది. దీనికి బ‌దులిచ్చిన ఎన్‌ డీఎంఏ (జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ‌) త‌ర‌ఫు లాయ‌ర్లు స‌మాధానం చెప్ప‌గా.. సుప్రీం న్యాయ‌మూర్తులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సుప్రీం ఇంత‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అంశంలో రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏం చేశాయ‌న్న విష‌యానికి చూస్తే.. ఇద్ద‌రు చంద్రుళ్లు దొందూ.. దొందే అని చెప్ప‌క త‌ప్ప‌దు. విప‌త్తు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి రెండుతెలుగు రాష్ట్రాల అధికారులు ఎలాంటి ప్ర‌ణాళిక‌ను రూపొందించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. నిత్యం.. ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం ఏన్నో చేస్తున్న‌ట్లుగా చెప్పుకునే ముఖ్య‌మంత్రులిద్ద‌రూ.. త‌మ స‌ర్కారు తీరుపై ఏమ‌ని స‌మాధానం చెబుతారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/