Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు 'అయోధ్య' లో మొదలైన కదలిక

By:  Tupaki Desk   |   8 March 2019 11:37 AM GMT
ఎట్టకేలకు అయోధ్య లో మొదలైన కదలిక
X
దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి కేసుకు సంబంధించి చిన్నపాటి కదలిక వచ్చింది. ఇన్నాళ్లూ వాయిదాలతోనే కాలయాపన జరగగా, తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. అయోధ్య వివాదాన్ని మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకునేందుకు సమ్మతిస్తూ, అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరిచింది.

మధ్యవర్తిత్వానికి అంగీకరించిన సుప్రీకోర్టు... ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ ను ఏర్పాటుచేసింది. ఫైజాబాద్ కేంద్రంగా మధ్యవర్తులతో చర్చలు సాగించాలని సూచించిన ధర్మాసనం.. ప్యానెల్ లో జస్టిస్ ఖిలీపుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచ్ లను నియమించింది.

అయోధ్యలో 2.7 ఎకరాల వివాదాస్పద భూమిపై కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. తర్వాత కొన్నాళ్లకు ఆ భూమి మాత్రమే కాకుండా.. చుట్టుపక్కలున్న 67 ఎకరాల్లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశించింది. మధ్యవర్తిత్వం సఫలమై, ఈ కేసుపై ఓ పురోగతి కనిపిస్తే... భారత్ లో సుదీర్ఘంగా నడుస్తున్న ఓ కేసుకు ఫుల్ స్టాప్ పెట్టినట్టవుతుంది.