Begin typing your search above and press return to search.

‘కోడి’ తీర్పుపై సుప్రీం చెప్పింది వింటే..

By:  Tupaki Desk   |   8 Jan 2017 5:45 AM GMT
‘కోడి’ తీర్పుపై సుప్రీం చెప్పింది వింటే..
X
సంక్రాంతి వస్తుందంటే చాలు.. కోడి పందేలతో ఏపీ లోగిళ్లు కళకళలాడిపోతుంటాయి. అన్నింటికి మించి ఉభయగోదావరి జిల్లాల్లో సాగే కోడి పందేల కోలాహాలానికి ఏపీలోని జిల్లాల నుంచే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి పోటెత్తుతుంటారు. అయితే.. కోడి పందేలపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రియాక్ట్ అయి.. చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీలో కోడి పందేలు జరగకుండా ఉండా తనిఖీలు చేయాలని.. హైకోర్టు కమిటీ వేయటం తన పరిధి దాటి వ్యవహరించటమేనని సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. కోడిపందేలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని తప్పు పడుతూ సుప్రీంకోర్టులో.. బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు ఒక పిటీషన్ ను దాఖలు చేశారు.

ఈ పిటీషన్ పై విచారణ తాజాగా జరిగింది. సంక్రాంతిపండగ సందర్భంగా నిర్వహించే కోళ్ల పందేలు జరగకుండా ఉండేందుకు.. ఎస్పీ ర్యాంకు హోదా ఉన్న అధికారితోపాటు తహసీల్దార్ ర్యాంకు అధికారి.. ఇద్దరుపోలీసులు.. జంతు సంరక్షణ బోర్డు సభ్యుడు.. ఫోగ్రాఫర్ తో కూడిన తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేయటాన్ని సుప్రీందృష్టికి తీసుకెళ్లారు పిటీషనర్.

ఈ పిటీషన్ ను విచారించే క్రమంలో పిటీషనర్ తన వాదనను వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని హైకోర్టే చేస్తే ప్రజా ప్రభుత్వాలు ఎందుకని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న ప్రధాన న్యాయమూర్తి.. ‘‘చట్టాలు లేకపోతేచట్టాలు చేయాలని ప్రభుత్వాలకు చెప్పొచ్చు.చట్టాలు ఉన్నప్పుడు వాటిని సక్రమంగా అమలు చేయాలని మాత్రమే కోర్టులు చెప్పి. కార్యనిర్వాహక వర్గం చేసే పనుల్ని కోర్టులు ఎలా చేస్తాయి’’ అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. కోళ్లను అదుపులోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీం.. కోళ్ల పందేలాకు ఉపయోగించే అయుధాల్ని మాత్రమే ఉపయోగించాలంటూ ఆదేశాల్ని జారీ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/