Begin typing your search above and press return to search.
రుణ మారటోరియంః వడ్డీ మాఫీ పై సుప్రీం కీలక తీర్పు!
By: Tupaki Desk | 23 March 2021 9:33 AM GMTలాక్ డౌన్ సమయంలో రుణాలపై విధించిన మారటోరియం పొడిగించాలని, వడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్ బీఐ ప్రకటించిన 6 మాసాల రుణ మారటోరియం పొడిగించాలని కోరుతూ దేశంలోని వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థలు సుప్రీంను ఆశ్రయించాయి. దీనిపై విచారించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
మారటోరియం పొడిగించాలని తాము ఆదేశించలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నప్పుడు తప్ప.. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. అదేవిధంగా.. రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని కూడా ఆదేశించలేమని చెప్పింది.
బ్యాంకులు.. తమ ఖాతాదారులకు, పెన్షనర్లకు వడ్డీలు చెల్లిస్తున్నాయి. కరోనా కష్ట కాలంలోనూ వడ్డీ చెల్లించాయి. అలాంటప్పుడు బ్యాంకులు ఇచ్చిన రుణాలపై వడ్డీలు మాఫీ చేయాలని ఎలా ఆదేశించగలం? అంటూ పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. అయితే.. వడ్డీమీద చక్రీ వడ్డీ మాత్రం వేయొద్దని బ్యాంకులను ఆదేశించింది.
కరోనా సమయంలో ప్రభుత్వం కూడా నష్టపోయిందన్న కోర్టు.. ప్రభుత్వాన్ని గానీ, ఆర్బీఐని గానీ.. ప్రత్యేక రంగాలకు రాయితీలు ఇవ్వాలని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. గతేడాది ఆర్బీఐ విధించిన మారటోరియం గడువు 2020 ఆగస్టుతో ముగిసింది. దీన్ని పొడిగించాలని, అదే సమయంలో వడ్డీని, చక్రవడ్డీని కూడా మాఫీ చేయాలని పిటిషన్లు దాఖలుగా.. పై విధంగా న్యాయస్థానం తీర్పు చెప్పింది.