Begin typing your search above and press return to search.

రెచ్చిపోయే నెటిజన్ల కు షాకిచ్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   24 Sep 2019 11:15 AM GMT
రెచ్చిపోయే నెటిజన్ల కు షాకిచ్చిన సుప్రీం
X
వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెడతాం.. మంచో చెడో మన గురించి మనం స్పందిస్తాం.. కానీ నెటిజన్లు ఊరుకుంటారా? ఏకిపారేస్తారు? ట్రోలింగ్ చేస్తారు? అసభ్యకర, అవమానాల పాలు చేసేలా కామెంట్లు చేస్తారు.

అప్పట్లో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ పెట్టిన పోస్టుకు నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా చేసి ఆమె ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితికి ఎగబడ్డారు. అనసూయే కాదు.. ట్విట్టర్ - ఫేస్ బుక్ లో ఏదీ స్పందించినా, భావ ప్రకటన స్వేచ్ఛతో రాసుకొచ్చినా వాటిని ట్రోల్ చేసే జనాలు చాలా మంది ఉన్నారు. వారిపై చర్య తీసుకుందామన్నా.. పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా అవి ఫేక్ అకౌంట్లు - లక్షల మంది ఉండడంతో సాధ్యపడడం లేదు.

మరి ఇలా సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిని ఏం చేయాలి? ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆయా సోషల్ మీడియా యాజమాన్యాలు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నియంత్రణ పాటించలేదు. దీంతో సోషల్ మీడియాల్లో నెటిజన్లు రెచ్చిపోతున్నారు.

తాజాగా ఈ విషయంపై సుప్రీంకోర్టు గడపతొక్కారు కొందరు. టెక్నాలజీ ప్రమాదకరంగా మారుతోందని.. సోషల్ మీడియాలో దుర్వినియోగాన్ని అరికట్టడాలని మొరపెట్టుకున్నారు. ఈ పిటీషన్ ను స్వీకరించిన సుప్రీం కోర్టు సంచలన కామెంట్లు చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్ లు, సందేశాలు ఇస్తున్న వారిని గుర్తించడంలో ఆయా యాజమాన్యాలు విఫలమయ్యాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రమే మార్గదర్శకాలను రూపొందించాలని.. ఈ సమస్యపై నడుం బిగించాల్సింది కేంద్రమేనని స్పష్టం చేసింది.

దీనిపై మూడు వారాల్లోగా కేంద్రం స్పందించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రానికి నోటీసులు పంపింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సుప్రీం కోర్టు సరైందని కాదని.. కేంద్రమే పరిష్కరించాలని న్యాయస్థానం అభిప్రాయపడింది.