Begin typing your search above and press return to search.

ప్రైవేటు ఆసుపత్రులు ఉలిక్కిపడేలా సుప్రీం వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   6 Jun 2020 4:15 AM GMT
ప్రైవేటు ఆసుపత్రులు ఉలిక్కిపడేలా సుప్రీం వ్యాఖ్యలు
X
ముప్పును ముందే ఊహించాం. లాక్ డౌన్ విధించాం. మహమ్మారి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్నామంటూ చేసుకునే ప్రచారానికి చెల్లుచీటి ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. క్యాలెండర్ లో రోజు మారే కొద్దీ.. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చూస్తున్నంతనే దేశంలో 2.7లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో రోజుకు పదివేల కేసులు నమోదయ్యే దరిద్రపుగొట్టు రోజులు షురూ కానున్నాయి.

తొలినాళ్లతో పోలిస్తే.. ఇప్పుడు మరణాలు కూడా పెరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న జోరు.. అందుకు తగ్గట్లే చోటు చేసుకునే మరణాలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా సుప్రీంకోర్టు విచారణలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా మాయదారి రోగానికి చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని ప్రశ్నించారు.

అంతేకాదు.. ప్రభుత్వ భూముల్లో లేదంటే తక్కువ ధరలకే ప్రభుత్వం నుంచి భూముల్ని కొనుగోలు చేసిన ప్రైవేటు ఆసుపత్రులు కొందరు పాజిటివ్ రోగులకైనా ఉచిత చికిత్స చేయాలని పేర్కొంది. ప్రైవేటు ఆసుపత్రులు కొంత సేవాభావంతో పని చేసేలా చూడాలన్న సుప్రీం మాటలు..ఆ రంగంలోని ఆసుపత్రుల యాజమాన్యాలు ఉలిక్కిపడేలా చేస్తాయనటంలో సందేహం లేదు. అంతేకాదు.. పాజిటివ్ రోగుల చికిత్సకు అయ్యే ఖర్చు మీదా పరిమితిని విధించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించే వేళ.. ఈ వ్యాఖ్యలు చేసింది. ఐసీఎంఆర్ ప్రైవేటు ఆసుపత్రులు టెస్టులు.. వైద్యం చేసేందుకు అనుమతించినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ఓకే చెప్పలేదు. దీంతో.. మహమ్మారికి చికిత్స ప్రైవేటులో చేస్తున్న చికిత్సలు చాలా తక్కువే. రానున్న రోజుల్లో పెరిగే కేసులకు అనుగుణంగా ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స చేయాల్సిన పరిస్థితి రావటం ఖాయమనే చెప్పాలి.