Begin typing your search above and press return to search.
‘రోజా’ కేసును హైకోర్టుకు పంపిన సుప్రీం
By: Tupaki Desk | 4 July 2016 10:34 AM GMTఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్ రోజా ఎన్నికకు సంబందించిన ఒక వ్యవహారం సుప్రీం దృష్టికి వచ్చింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటీషన్ ను సుప్రీం కోర్టు పరిశీలించి.. ఆ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టులో అవసరం లేదన్న అత్యున్నత న్యాయస్థానం.. ఈ కేసును విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
ఎన్నికల సమయంలో తన ఆస్తుల విషయంలో వివరాల్ని తప్పుగా ఇచ్చారంటూ రోజాపై ఓ వ్యక్తి పిటీషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును హైకోర్టులో విచారించాలని పేర్కొంది. అదే సమయలో.. ఈ కేసును ఏడాది లోపు ముగించాలని హైకోర్టుకు తెలిపింది. ఈ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్యే రోజా వివరణ కూడా తీసుకోవాలని ఆదేశించింది.