Begin typing your search above and press return to search.

సాధార‌ణ బ‌డ్జెట్‌ను దాటేసిన ఉచితాల బ‌డ్జెట్‌.. సుప్రీం తీవ్ర ఆందోళ‌న‌..!

By:  Tupaki Desk   |   26 Jan 2022 2:58 AM GMT
సాధార‌ణ బ‌డ్జెట్‌ను దాటేసిన ఉచితాల బ‌డ్జెట్‌.. సుప్రీం తీవ్ర ఆందోళ‌న‌..!
X
దేశంలోనే కాకుండా.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా రాజ‌కీయ పార్టీలు అధికారంలోకి వ‌చ్చేందుకు ఎన్నిక‌ల‌కు ముందు విప‌రీత‌మైన హామీలు గుప్పించేస్తున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎన్నో ఉచితాచిత ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతుంటే.. ప్ర‌తిప‌క్ష పార్టీ సైతం అధికారంలోకి వ‌చ్చేందుకు లెక్క‌కు మిక్కిలిగా హామీలు ఇస్తోంది. అస‌లు ఇప్పుడు ఏపీలో సంక్షేమం పేరిట కోట్లాది రూపాయ‌లు ఫ్రీగా ప్ర‌జ‌ల అక్కౌంట్ల‌లోకి నేరుగా వెళ్లిపోతున్నాయి. అమ్మఒడి, పెన్ష‌న్లు, 45 ఏళ్లు దాటిన కొన్ని వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు వేలాది రూపాయ‌లు.. ఓవ‌రాల్‌గా కోట్ల‌కు కోట్లు ఫ్రీగా జ‌నాల ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతున్నాయి. ఈ ఖ‌ర్చంతా అస‌లు అభివృద్ధితో లెక్క‌లేకుండా ఖ‌ర్చ‌వుతోంది.

చివ‌ర‌కు ఈ ఉచిత బ‌డ్జెట్ మొత్తం సాధార‌ణ బ‌డ్జెట్‌ను మించి ఉంటోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇదే అంశంపై మంగ‌ళ‌వారం తీవ్ర‌మైన ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ ప‌రిస్థితి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలి ? దీనిని ఎలా క‌ట్ట‌డి చేస్తారో ? చెప్పాల‌ని ఏకంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు వివిధ పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి.

ఈ హామీల‌పై జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీనిని చ‌ట్ట‌బ‌ద్ధంగా ఎలా నియంత్రించాలో నాకు తెలియ‌దు.. ఈ హామీలు ఉచిత బ‌డ్జెట్‌ను మించిపోతున్నాయి.. ఈ ప‌రిస్థితిని నిరోధించేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌ని కూడా గ‌తంలో ఎన్నిక‌ల సంఘానికి సూచ‌న‌లు చేసిన విష‌యాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే అప్పుడు కేవ‌లం రాజ‌కీయ పార్టీలు, నాయ‌కుల అభిప్రాయం కోరుతూ ఒక్క స‌మావేశం మాత్ర‌మే ఏర్పాటు చేసింద‌ని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల‌కు ముందు ఉచితాల‌తో మ‌భ్య‌పెట్టే పార్టీల గుర్తుల‌ను సీజ్ చేసేలా... ఆ పార్టీ రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేసేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు అయ్యింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీం ఈ విచార‌ణ నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.