Begin typing your search above and press return to search.
లోక్ సభ ఎన్నికల రద్దు చేయాలట.. సుప్రీం ఘాటు స్పందన!
By: Tupaki Desk | 5 July 2019 12:35 PM GMTఒకటిన్నర నెల కిందట మొత్తం ఎన్నికల తతంగం పూర్తయ్యి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగా.. ఆ ఎన్నికల ప్రక్రియ మీద కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మోడీ సర్కారు తిరిగి ఎన్నిక కావడం ఇష్టం లేని వారు ఆ మేరకు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బ తిన్న వాళ్లు ఎన్నికల ప్రక్రియ మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కొందరు సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఈ అంశంలో ఆశ్రయించారు.
అలాంటి పిటిషన్ ఒకటి సుప్రీం కోర్టు ముందుకు వెళ్లగా న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ఆ పిటిషన్ కు విచారణార్హతే లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈవీఎంలతో జరిగిన ఎన్నికలను రద్దు చేయాలని, బ్యాలెట్ పేపర్ల మీద మళ్లీ ఎన్నికలను నిర్వహించాలంటూ ఒక పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
సుప్రీం కోర్టు న్యాయవాదే ఒకరు ఈ పిటిషన్ ను వేశాడు. అయితే అలాంటి పిటిషన్ ను విచారించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈవీఎంలపై ఎన్నికల ముందు కొన్ని రాజకీయ పార్టీలు చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. ఈవీఎంల ట్యాంపరింగ్ అసలు సాధ్యం కాదని సీఈసీ స్పష్టం చేస్తూ వచ్చింది. గతంలో ఈవీఎంల మీద నెగ్గిన పార్టీలు కూడా ఈ సారి ఈవీఎంల మీద అపనమ్మకం వ్యక్తం చేశాయి. అయితే ప్రజలు మాత్రం ఈవీఎంలపై పూర్తి విశ్వాసాన్నే ఉంచారు. ఓడిన రాజకీయ పార్టీల అభిమానులు మాత్రం ఇలాంటి పిటిషన్లు, వాదనలు వినిపిస్తూ ఉన్నారు.