Begin typing your search above and press return to search.
చచ్చిపోయిన రైతులు మీ బంధువులైతే.. ఇలాగే చేస్తారా?.. యోగిపై సుప్రీం సీరియస్
By: Tupaki Desk | 8 Nov 2021 10:30 AM GMTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ``చచ్చిపో యిన రైతులు మీ కుటుంబ సభ్యులో.. బంధువులో.. అయితే.. విచారణ ఇలాగే జరిపిస్తారా? ఇంత నెమ్మది గానే రిపోర్టులు ఇస్తారా? నిందితులను ఇంత తేలికగా తీసుకుంటారా?`` అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ కేసులో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్టుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇందులో ఎక్కువమంది సాక్షులను విచారించినట్లు తప్ప మరేమీ లేదని వ్యాఖ్యానించింది.
కేసు దర్యాప్తు తాము ఆశించిన విధంగా ముందుకుసాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. అప్పటి ఘటనలో కేంద్ర సహాయ మంత్రి కుమారుడు.. రైతులు చేస్తున్న ఆందోళనపై.. కారును దూకించారు. ఈ ఘటనలో ఒక జర్నలిస్టు సహా.. నలుగురు రైతులు చనిపోయారు. ఈ కేసు విచారణ చాలా మందకొడిగా.. చేద్దామా..? వద్దా.? అన్నట్టుగా చేస్తున్నారని.. సుప్రీం కోర్టు ఇటీవల కూడా మండిపడిం ది. తాజాగా జరిగిన విచారణలో మరింత సీరియస్ అయింది. వేగం పుంజుకోకుండా.. ఉద్దేశ పూర్వకంగా ఎవరో అడ్డు పడుతున్నారని పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది.
దీంతో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్ల పేర్లను ఇందుకు సిఫారసు చేసింది. దీనిపై యూపీ ప్రభుత్వం నాలుగు రోజుల్లో స్పందన తెలియజేయాలని పేర్కొంటూ విచారణ వాయిదా వేసింది. అక్టోబర్ 3న జరిగిన లిఖింపుర్ ప్రాంతంలో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు నడుపుతున్న కారు.. నిరసన తెలుపుతున్న రైతులపైకి దూసుకెళ్లిన ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రను పోలీసులు అరెస్టు చేశారు.