Begin typing your search above and press return to search.

అలా అయితే కూతుళ్లకు ఆస్తిలో వాటా ఉండదట

By:  Tupaki Desk   |   3 Nov 2015 7:55 AM GMT
అలా అయితే కూతుళ్లకు ఆస్తిలో వాటా ఉండదట
X
కొడుకులతో పాటు సమానంగా కూతుళ్లకు ఆస్తిహక్కు విషయానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా ఆసక్తికర తీర్పు ఇచ్చింది. తాజా తీర్పు కూతుళ్లకు విపరీతమైన అసంతృప్తికి గురి చేయటం ఖాయమని చెబుతున్నారు. తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు సైతం సమానా వాటా కోసం పోరాడుతున్న వారికి నిరాశ కల్పిస్తూ తాజా తీర్పు ఉండటం గమనార్హం.

తాజాగా వెలువరించిన తీర్పు ప్రకారం.. 2005 ముందు చనిపోయిన వారి ఆస్తిలో కూతురుకు వాటా ఉండదని సుప్రీం తేల్చింది. హిందూ వారసత్వ చట్టం 2005లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ఈ చట్టం రావటానికి ముందు అంటే.. 2005 సెప్టెంబరు 9లోపు చనిపోయిన ఇంటి పెద్దకు సంబంధించి ఆస్తి విషయంలో కుమార్తెలకు వాటా ఉండదని తేల్చింది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి. 2005 సెప్టెంబర్ ముందు చనిపోయిన తల్లిదండ్రుల ఆస్తి కోసం పోరాడే అడపిల్లలకు ఈ తీర్పు శరాఘాతంగా మారనుంది.