Begin typing your search above and press return to search.
కర్ణాటకకు డెడ్ లైన్ ఫిక్స్ చేసిన సుప్రీం!
By: Tupaki Desk | 3 Oct 2016 9:21 AM GMTగత కొన్ని రోజులుగా కర్ణాటకకు - సుప్రీం కోర్టుకు మధ్య చిన్న సైజు వార్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తమిళనాడుకు కర్ణాటక జలాలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే పలుసార్లు ఉత్తర్వ్యులను జారీ చేసినా వాటిని కర్నాటక ప్రహుత్వం బేఖాతరు చేస్తూనే ఉంది. ఈ విషయంపై తాజాగా సుప్రీం కోర్టు కర్నాటక ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం మానుకోవాలని ఘాటుగా సూచించింది.
ఇప్పటికే కావేరీ జలాల విషయంలో సెప్టెంబరు 23న ఉత్తర్వ్యులను వెలువరించిన కోర్టు ఆ నెల 27 వరకు కావేరి నది నుంచి రోజూ 6 వేల క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని కర్ణాటకలో అన్ని పార్టీలు నిర్ణయించాయి. అలాగే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ శనివారం కర్ణాటక విధాన సౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే.
పరిస్థితులు ఇలా ఉండటంతో పొరుగు రాష్ట్రం తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల చేశారా? చేయరా? అనే విషయంలో కర్నాటక కు డెడ్ లైన్ విదించింది సుప్రీం కోర్టు. ఈ మేరకు తాజాగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలలోపు తమిళనాడుకు నీటి విడుదల విషయంలో తనకు తెలియజేయాలని డెడ్‌లైన్ విధించింది.
కావేరి జలాల పంపిణీ విషయంలో తమిళనాడు-కర్ణాటక మధ్య రాజీ కుదిర్చేందుకు సుప్రీం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీటి విడుదలకు కర్ణాటక ఒప్పుకోకపోవడంతో ఈ వివాదం తీవ్రఉద్రిక్తతలకు దారితీసింది. ఈ మేరకు కావేరి రిజర్వాయర్లలోని నీటిని పరిశీలించేందుకు కేంద్రం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని కర్ణాటక కోరుతున్నా.. అది వీలుకాదని, పరిశీలక కమిటీ ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా, రాష్ట్రంలోని నగరాలు నీటికొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో నవంబర్ వరకు తమిళనాడుకు నీళ్లు వదిలే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/