Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ కు సుప్రింకోర్టు షాక్
By: Tupaki Desk | 8 April 2022 5:49 AM GMTదాయాది దేశం పాకిస్తాన్ కు ఆ దేశపు సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది. పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తిరస్కరించారు. దానిపై కొందరు సుప్రింకోర్టులో చాలెంజ్ చేశారు. కేసును విచారించిన సుప్రీంకోర్టు డిప్యుటీ స్పీకర్ నిర్ణయాన్ని కొట్టేసింది. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యుటీ స్పీకర్ తోసిపుచ్చగానే ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు.
తాజాగా సుప్రింకోర్టు తీర్పు ప్రకారం జాతీయ అసెంబ్లీని తిరిగి పునరుద్ధించాల్సిన అగత్యం డిప్యుటి స్పీకర్ కు వచ్చింది. సుప్రీంకోర్టు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఇమ్రాన్ ఏ మాత్రం ఊహించుండరు. తాజాగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఇమ్రాన్ ఇపుడు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోక తప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయి. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తుల మద్దతుగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిందనే ఇమ్రాన్ ఆరోపణకు విలువలేకుండా పోయింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం 9వ తేదీ ఉదయం 10 గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరచి ఇమ్రాన్ పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగబోతోంది.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లను స్పీకర్ వెంటనే మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే దేశంలో మొదలైన సంక్షోభం కారణంగా ఇమ్రాన్ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. దీన్నుంచి జనాల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలని ఇమ్రాన్ భావిస్తున్నారు.
వివిధ కారణాలతో ఇమ్రాన్ వైఖరి నచ్చక భాగస్వామ్య పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. ఇదే సమయంలో సొంత పార్టీకే చెందిన 24 మంది ఎంపీలు పార్టీకి రాజీనామా చేశారు. అలాగే మంత్రివర్గానికి ముగ్గురు రాజీనామాలు చేశారు. వీరంతా ఇస్లామాబాద్ కు దూరంగా ఉన్న మరో ప్రావిన్స్ లో దాక్కున్నారు.
ప్రభుత్వానికి తాము అందుబాటులో ఉంటే తమ ప్రాణాలకి హాని జరుగుతుందనే భయం వీళ్ళందరినీ వెంటాడుతోంది. ఇదంతా గమనించిన ఇమ్రాన్ భాగస్వామ్య పార్టీలను, సొంతపార్టీ ఎంపీలను భేటీకి రామ్మని పిలిచారు. అయినా ఎవరు వెళ్ళలేదు. దాంతో తన ప్రభుత్వం పడిపోక తప్పదని ప్రధానికి అర్ధమైపోయింది. దానిమీద సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది.