Begin typing your search above and press return to search.
బైడెన్ కు సుప్రింకోర్టు షాక్
By: Tupaki Desk | 24 Jun 2022 7:33 AM GMTఅగ్రరాజ్యంలో అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ ను కంట్రోల్ చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది. తుపాకులు కలిగివుండటం అమెరికన్ల హక్కని తేల్చి చెప్పేసింది. ఆత్మరక్షణ కోసం అమెరికాలో తుపాకులు కలిగివుండటం తప్పేమీ కాదని స్పష్టంగా ప్రకటించింది. దీంతో అధ్యక్షుడితో పాటు సెనేటర్లకు ఏమిచేయాలో దిక్కుతోచటం లేదు.
ఈమధ్య కాలంలో విద్యా సంస్ధల్లో తుపాకులతో చొరబడి పిల్లలను కాల్చి చంపుతున్న ఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని 21 ఏళ్లలోపు యువకులకు తుపాకులు అందుబాటులో లేకుండా చేయాలని జనాలు పెద్ద ఆందోళన చేశారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆందోళలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటులో రిపబ్లికన్లు, డెమక్రాట్లు కలిసి గన్ కల్చర్ పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిసైడ్ చేశారు.
పార్లమెంటులో బిల్లు పెట్టి, చర్చించి నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నేపధ్యంలోనే కొందరు యువకులు కోర్టులో కేసులు దాఖలు చేశారు. వీళ్ళ పిటీషన్లను విచారించిన సుప్రింకోర్టు యువకులకు మద్దతుగా తీర్పిచ్చింది.
చాలా రాష్ట్రాల్లో స్కూళ్ళు, కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా తమ స్కూల్ బ్యాగుల్లో లంచ్ బాక్సులు పెట్టుకున్నట్లే తుపాకులు కూడా పెట్టుకుని వెళతారు. ఆటలాడుతున్నపుడే లేదా ఇంకేదో కారణాల వల్లో సదరు విద్యార్ధికి ఇతరులపై కోపం వస్తే వెంటనే తుపాకి తీసి కాల్చేస్తున్నాడు.
ఇలాంటి విషయాలను పక్కన పెట్టేస్తే న్యూయార్క్, న్యూజెర్సీ, లాస్ ఏంజిలీస్, బోస్టన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కొందరు యువకులు స్కూళ్ళల్లోకి ప్రవేశించి విద్యార్ధులను కాల్చి చంపేశారు. స్కూళ్ళల్లోకి ప్రవేశించటం పక్కన పెట్టేస్తే రెస్టారెంట్లు, పబ్ ల్లోకి కూడా తుపాకులతోనే ఎంటరవుతున్నారు. ఇక అమెరికాలో జనాభా సుమారు 35 కోట్లయితే తుపాకులు మాత్రం 70 కోట్లున్నాయని అంచనా.
ఒక్కొక్కళ్ళ దగ్గర మూడు నాలుగు తుపాకులు కూడా ఉంటున్నాయట. ఆయుధాల టర్నోవర్ ఏడాదికి రు. 75 వేల కోట్లు. ఈ టర్నోవర్ చూస్తేనే ఆయుధాల వ్యాపారం అమెరికాలో ఎలా వర్ధిల్లుతోందో తెలిసిపోతుంది.