Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారుకు సుప్రీం షాక్.. అలా చేయడానికి వీల్లేదన్న కోర్టు
By: Tupaki Desk | 28 April 2022 3:30 AM GMTతెలంగాణలో 19 లక్షలకు పైగా రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌పై బుధవారం విచారణ జరిగింది. సరైన పరిశీలన లేకుండా లక్షల రేషన్ కార్డులు ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. పరిశీలన చేయకుండా రేషన్ కార్డులను ఎలా రద్దు చేస్తారన్న ధర్మాసనం.. 2016 మార్గదర్శకాలతో మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించింది. అలాగే కార్డుల రద్దుకు ఎలాంటి ప్రమాణాలు పాటించారో అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.
తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేతను ఇలా చేస్తారా? అని ధర్మాసనం పేర్కొంది. సరైన పరిశీలన లేకుండా ఎలా తొలగిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు అయింది. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. 2016లో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మళ్లీ క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే అదే సమయంలో బోగస్ రేషన్ కార్డుల పేరుతో సుమారు 19 లక్షల కార్డులను తొలగించింది. ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగివారిని గుర్తించి తీసివేసింది. చనిపోయిన వారి పేరుతో ఉన్న కార్డులతో పాటు ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉన్నవారిని గుర్తించి ఆ కార్డులను కూడా తొలగించింది.
అయితే అర్హుల కార్డులను తొలగించినట్లు పలువురు ఆరోపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రేషన్ కార్డుల తొలగింపుపై మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఇలా కూడా చేయొచ్చని అధికారులు కొత్త విధానం తీసుకువచ్చారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది. మరిదీనిపై కేసీఆర్ ప్రభతువ్ం ఎలా రియాక్ట్ అవుతుతుందో చూడాలి.