Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు కు సుప్రీం షాక్..దిట్టలకు దిశ కేసు

By:  Tupaki Desk   |   13 Dec 2019 6:10 AM GMT
కేసీఆర్ సర్కారు కు సుప్రీం షాక్..దిట్టలకు దిశ కేసు
X
దిశ ఎన్ కౌంటర్ పై విచారణ బాధ్యతను గండర గండరులు లాంటి నిఖార్సైన వ్యక్తులకు అప్పగించి సుప్రీం కోర్టు తాజాగా తెలంగాణ సర్కారుకు షాకిచ్చింది. దిశ నిందుతుల ఎన్ కౌంటర్ పై ఇటు మానవ హక్కుల సంఘం, హైకోర్టు, సుప్రీం కోర్టు విచారణలన్నింటిని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు తాజాగా ఈ ఎన్ కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని త్రిసభ్య కమిషన్ ను నియమించింది.

ఈ ముగ్గురు సభ్యులు నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపాలైన ఖతర్నాక్ వ్యక్తులే కావడం తెలంగాణ సర్కారును, తెలంగాణ పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తోంది.ఈ ముగ్గురు క్రిమినల్ కేసులు పరిష్కరించడంలో ఛేధించడంలో దిట్టలుగా పేరొందారు.

సుప్రీం కోర్టు దిశ ఎన్ కౌంటర్ పై విచారణ చేయాలని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ఆధ్వర్యంలో జస్టిస్ రేఖా ప్రకాష్ సోండూర్ బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ లను నియమించారు.

*జస్టిస్ సిర్పుర్కర్ సంచలన తీర్పులకు పెట్టింది పేరు. ఎర్రకోట పై దాడి చేసిన పాకిస్తానీ ఉగ్రవాది మహ్మద్ ఆరీఫ్ కు ఉరిశిక్ష వేసారు. పార్లమెంట్ పై దాడి చేసిన అప్ఝల్ గురును ఉరితీయించింది ఈయనే .

*ఇక జస్టిస్ రేఖా ప్రకాష్ నేర న్యాయవ్యవస్థ పనితీరుపై పూర్తి అవగాహన ఉన్న గొప్ప న్యాయమూర్తి. అనేక అభ్యుదయ సంఘాల్లో సైతం పనిచేస్తున్నారు.

*ముచ్చటగా మూడో వ్యక్తి డీఆర్ కార్తికేయన్ కు ఐపీఎస్ గా గొప్ప ట్రాక్ రికార్డ్ ఉంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై దర్యాప్తు చేసింది ఈయనే. 26 మంది రాజీవ్ హంతకులకు శిక్ష పడేలా చేశాడు. హైదరాబాద్ లో చాలా రోజులు సీఆర్పీఎఫ్ ఐజీగా చేశారు. నేరాన్ని ఈజీగా పసిగట్టడంలో ఈయనది అందెవేసిన చేయి.

ఇలా ముగ్గురు కరుడు గట్టిన గట్టి వ్యక్తులను దిశ ఎన్ కౌంటర్ పై విచారణ కు సుప్రీం కోర్టు నియమించింది. ఈ పరిణామం తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను ఇరుకునపడేలా చేస్తోంది.