Begin typing your search above and press return to search.

సైరస్ మిస్త్రీ కి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం !

By:  Tupaki Desk   |   10 Jan 2020 9:32 AM GMT
సైరస్ మిస్త్రీ కి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం !
X
పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌ ను సాధిస్తోన్న టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ పదవికి ఎసరు పడింది. జాతీయ పారిశ్రామిక న్యాయ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. సైరస్ మిస్త్రీ కి నోటీసులను జారీ చేసింది. ఫలితంగా- సైరస్ మిస్త్రీ తన హోదా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇకపోతే పూర్తి వివరాలు చూస్తే .. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పనిచేసిన సైరస్ మిస్త్రీని యాజమాన్యం అర్ధాంతరంగా తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన కంపెనీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌ లో పిటీషన్‌ ను దాఖలు చేశారు. ఎలాంటి కారణం చూపకుండానే. తన కాల వ్యవధి తీరకుండానే.. అర్ధాంతరంగా తనను తప్పించారంటూ మిస్త్రీ గతంలో దాఖలు చేసిన పిటీషన్‌పై అప్పిలేట్ ట్రైబ్యునల్ సానుకూలంగా స్పందించి, టాటా సన్స్ ఛైర్మన్‌ గా మిస్త్రీ పునర్నియామకానికి గల అడ్డంకులను తొలగిస్తూ గత 18వ తేదీన ఈ తీర్పు ని వెల్లడించింది. ఆ వెంటనే ఆయన బాధ్యతలను కూడా స్వీకరించారు. అయితే, కంపెనీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై వ్యవస్థాపకుడు రతన్ టాటా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో పిటీషన్‌ ను దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీం ఇరుపక్షాల వాదోపవాదాలను విన్న తరువాత అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.