Begin typing your search above and press return to search.

రెబెల్ రాజుకు సుప్రీం షాక్

By:  Tupaki Desk   |   11 Nov 2022 8:58 AM GMT
రెబెల్ రాజుకు సుప్రీం షాక్
X
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజుకు సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రతీ చిన్న విషయానికి సుప్రీం కోర్టు తలుపు తట్టడమేంటని అసహనం వ్యక్తం చేసింది. ఒక వైపు హై కోర్టులో విచారణ జరుగుతూంటే వేచి చూసే ఓపిక లేకపోతే ఎలా అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏ విషయంలో రెబెల్ రాజు విషయంలో సుప్రీం కోర్టు ఏ విషయంలో షాక్ ఇచ్చింది అంటే విశాఖ రుషికొండ అక్రమ తవ్వకాల మీద ఆయన వేసిన పిటిషన్ మీద అని చెప్పాలి.

రుషికొండలో పెద్ద ఎత్తున అక్రమంగా తవ్వకాలు జరిపారని ఇది పర్యావరణానికి నిబంధలనకు పూర్తి వ్యతిరేకమని పేర్కొంటూ రాజు గారు పిటిషన్ వేశారు. దీని మీద విచారణ చేపట్టకుండాఏ పిటిషన్ ని సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.

ప్రతీ జాగాకు సుప్రీం కోర్టుకుని ఆశ్రయిస్తే ఎలా అని ఆయన్ని ప్రశ్నించింది. అదే సమయంలో హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకోవాలని రాజు గారు కోరిన దాన్ని తిరస్కరించింది. తాము ఈ విషయంలో ఈ దశలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

ఈ మేరకు హై కోర్టు పూర్తి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వేచి చూడాలని సూచించింది. ఇక చూస్తే రెండు కిలోమీటర్ల దాకా రుషికొండలో అక్రమ తవ్వకాలు జరిపారని కోర్టు దృష్టికి రఘురామ క్రిష్ణం రాజు తరఫున న్యాయవాది తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను కూడా ఆయన కోర్టు ముందు ఉంచే ప్రయత్నం చేశారు.

అయితే ఈ విషయంలో ఏ మాత్రం ఆసక్తి చూపించని సుప్రీం కోర్టు ఈ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఇక అభివృద్ధి పర్యావరణం మధ్య సమతూల్యత పాటించాలని సుప్రీం కోర్టు గతంలోనే సూచించింది. మొత్తానికి చూస్తే రెబెల్ రాజు గారి పిటిషన్ డిస్మిస్ కావడం చర్చకు తావిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.