Begin typing your search above and press return to search.
తెలంగాణ వాదన సుప్రీంకు ఎందుకు నచ్చలేదు?
By: Tupaki Desk | 10 Jan 2017 5:38 AM GMTతెలంగాణ రాష్ట్రానికి పెద్ద కష్టమే వచ్చింది. తమ వాదనను ఎవరూ అర్థం చేసుకోవటం లేదన్నట్లుగా వాపోతోంది. కృష్ణా జలాల పంపిణీని సరికొత్తగా వాటాలు వేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సర్కారు వాదిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ అంశంపై తాజాగా సుప్రీంకోర్టు తెలంగాణ వాదనను కొట్టిపారేస్తూ.. తన నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర సర్కారు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
తమ వాదనను కేంద్రం పట్టించుకోవటం లేదని.. సుప్రీం వినటం లేదని.. ఇక తాము ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నిస్తోంది. నిజంగానే తెలంగాణ రాష్ట్రవాదనను కేంద్రం పట్టించుకోలేదా? సుప్రీం వినటం లేదా? అన్నప్రశ్నలపై సూటిగా.. స్పష్టంగా సమాధానాలు వెతికితే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఈ లొల్లి ఎక్కడ షురూ అయ్యిందంటే.. ఉమ్మడిగా ఉన్న ఏపీ.. తెలంగాణలు రెండు రాష్ట్రాలు విడిపోవటంతో ఈ పంచాయితీ మొదలైందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటంతో కృష్ణా జలాల్ని ఇప్పటివరకూ పంచిన రీతిలో కాకుండా.. మిగిలిన భాగస్వామ్య పక్షాలన్నింటకి కలిపి కొత్తగా కేటాయింపులు జరపాలన్నది తెలంగాణ రాష్ట్ర వాదన.
దీనిపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇస్తూ.. విభజన నేపథ్యంలో మరోసారి కేటాయింపులు జరపాలని కోరటం సరి కాదని.. ఏ రాష్ట్రమైతే రెండుగా విడిపోయిందో.. వారికి చెందిన వాటానే పంచాలని పేర్కొంది. దీనిపై తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపైవిచారించిన అత్యున్నత న్యాయస్థానం బ్రిజేశ్ కుమార్ తీర్పును సమర్థించటమే కాదు.. తెలంగాణ వాదనను తప్పుపట్టింది.
తెలంగాణ కోణంలో చూస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణా జలాల్ని మాత్రమే తమకు పంచితే.. తమకు అన్యాయం జరుగుతుందని వాదిస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతాల కింద ఉన్న రాష్ట్రాలన్నింటికి మరోసారి ఒక జట్టుగా చేసి.. వారి మధ్య తాజాగా పంపకాలు జరపాలన్నది తెలంగాణ సర్కారు వాదన. విభజన చట్టంలోని సెక్షన్ 89ను ప్రకారం నిధులు.. నియామకాలు.. నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందన్న కారణంగానే రాష్ట్రం విడిపోయిందని.. ఈ ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు సెక్షన్ 89ను పొందుపర్చటం జరిగిందని.. ఇందులోని విస్తృతార్థారన్ని ట్రిబ్యునల్ విస్మరించిందన్నది తెలంగాణ రాష్ట్ర వాదన.
అయితే.. ఈ వాదనను సుప్రీం సింపుల్ గా కొట్టి పారేసింది. అదెలానంటే.. విడిపోయిన ప్రతిసారీ కేటాయింపులు మళ్లీ మళ్లీ కొత్తగా చేయాలా? అన్న సూటి ప్రశ్నను సంధించింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాన్ని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏ.. తెలంగాణ బి.. తెలంగాణ సి అంటూ మూడు రాష్ట్రాలుగా విడిపోయిందని అనుకుందామని.. అప్పుడుమళ్లీ అన్ని రాష్ట్రాలకు నీటి కేటాయింపులు మొదటి నుంచి చేస్తారా?అంటూ అసలు సమస్యను వివరించే ప్రయత్నంతో పాటు.. తెలంగాణ వాదన తప్పు ఎలా అవుతుందన్నది చెప్పే ప్రయత్నం చేసింది.
ఈ కేసులో కర్ణాటక న్యాయవాది చేసిన వాదనల్ని గమనించాల్సిన అంశం ఉంది. విభజన చట్టంలో కర్ణాటకకు కానీ మహారాష్ట్రకు కానీ సంబంధం లేదని గుర్తు చేయటంతో పాటు.. విభజన చట్టంలోని కారణాలు.. ఉద్దేశాల్ని విశ్లేషిస్తే నదీ జలాల పంపకానికి ప్రాతిపదిక దొరుకుతుందని చెప్పటంతో పాటు.. తమకేమాత్రం సంబంధం లేని అంశంలో తమను భాగస్వామ్యం చేయటం ఏమిటన్న వాదనకు మహారాష్ట్ర న్యాయవాది కూడా మద్దతు పలకటంతో తెలంగాణ రాష్ట్ర వాదనను సుప్రీం కొట్టేసింది. క్లిష్టమైన అంశాల విషయంలో లోతులకు వెళ్లే కొద్దీ మరిన్ని పీటముడులు పడటమే తప్పించి.. పరిష్కారం లభించదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/