Begin typing your search above and press return to search.

జర్నలిస్ట్ ల కోసం సుప్రీం కోర్టు ప్రత్యేక యాప్

By:  Tupaki Desk   |   13 May 2021 3:30 PM GMT
జర్నలిస్ట్ ల కోసం సుప్రీం కోర్టు ప్రత్యేక యాప్
X
దేశవ్యాప్తంగా కరోన కేసులు లక్షల్లో నమోదు అవుతున్న ఈ సమయంలో సుప్రీం కోర్టు వాదనలు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో సుప్రీం కోర్టు తీర్పు లకు సంబందించిన వివరాలు మీడియాకు అందడం కష్టంగా మారింది. అందుకే దేశంలోనే మొదటి సారి సుప్రీం కోర్టు చరిత్రలో నే మొదటి సారి ప్రత్యేకమైన యాప్ ను తీసుకు వచ్చారు. ఈ యాప్ ను సీజేఐ ఎన్వీ రమణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా ద్వారా కోర్టులకు సంబందించిన తీర్పులు అన్ని కూడా జనాలకు చేరువ అవుతున్నాయి. తీర్పులు మీడియా లో రాకుండా ఉండకుండా అడ్డుకోలేమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్ట్ లు కోర్టులకు హాజరు అయ్యే పరిస్థితి లేదు. అందుకే వారికోసం ఈ యాప్ ను తీసుకు వచ్చాము. మీడియా సంస్థలు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ యాప్ ద్వారా ప్రజలకు కోర్టుకు సంబందించిన సమాచారాన్ని అందించవచ్చు అన్నారు.

సుప్రీం కోర్టు వ్యవహారాలు తెలియాలంటే ఎక్కువగా జర్నలిస్టులు లాయర్ లను ఆశ్రయించి వారినుండి సమాచారం తీసుకోవాల్సిందే. నేను కెరీర్ ఆరంభంలో జర్నలిస్ట్ గా చేసిన అనుభవం ఉంది. ఆ సమయంలో నేను సమాచారం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ ఇబ్బందులు నాకు తెలుసు. అందుకే వారి కోసం ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు.