Begin typing your search above and press return to search.
సుప్రీం తీర్పును తప్పు పట్టిన కట్జూను రమ్మన్నారు
By: Tupaki Desk | 17 Oct 2016 5:51 PM GMTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కదిలే రైలులో అత్యాచారం జరిగి.. ప్రాణాలు విడిచిన సౌమ్య ఉదంతంపై సుప్రీంకోర్టు ఊహించని నిర్ణయం ఒకటి తీసుకుంది. 2011లో కేరళలోని ఒక షాపింగ్ మాల్ లో పని చేసే సౌమ్య.. తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో ట్రైన్లో ప్రయాణించింది. ఆ సమయంలో ఆమెపై గోవిందసామీ అనే వ్యక్తి దారుణంగా దాడి చేయటమే కాదు.. పైశాచికంగా అత్యాచారం చేశాడు. అనంతరం కదులుతున్న రైలు నుంచి ఆమెను తోసేయటంతో తీవ్రంగా గాయపడిన ఆమె.. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఉదంతంలో కిందికోర్టులు గోవిందసామీకి మరణశిక్షను విధించగా.. తాజాగా సుప్రీంకోర్టు ఈ తీర్పును సరిచేస్తూ.. అతనికి 14 ఏళ్ల జైలుశిక్షగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా పలువురు తప్పు పట్టారు. అయితే.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు మాత్రం ఫేస్ బుక్ లో ఈ తీర్పుపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయటం.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పు పట్టారు.
దీంతో.. కట్జును సుప్రీం ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను కోర్టుకు రావాలని ఆహ్వానించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తన అభిప్రాయాల్ని వివరించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఉదంతంపై వచ్చే నెల 11న కట్జును సుప్రీంకోర్టుకు హాజరు కావాలని కోరింది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు తీర్పును పున:సమీక్షించాలంటూ సౌమ్య తల్లి.. కేరళ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/