Begin typing your search above and press return to search.

జగన్ బ్యాచ్ మాటకు సుప్రీం నో చెప్పింది

By:  Tupaki Desk   |   8 July 2016 8:24 AM GMT
జగన్ బ్యాచ్ మాటకు సుప్రీం నో చెప్పింది
X
జగన్ బ్యాచ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదుదైంది. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయిన అంశంపై ఆ పార్టీ నేతలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ అంశంపై సుప్రీంలో విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడింది.

ఈ వ్యవహారాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. కేసు విచారణను హైకోర్టు త్వరగా పూర్తి చేస్తుందన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేయటం గమనార్హం. దీంతో.. సుప్రీంతో ఏపీ సర్కారుకు షాక్ ఇవ్వాలని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ముందుకు సాగలేదనే చెప్పాలి. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఏపీ అధికారపక్షంలో చేరటంపై ఇప్పటికే ఏపీ స్పీకర్ కు ఫిర్యాదు చేయటం.. అయితే.. ఈ వ్యవహారంపై జగన్ బ్యాచ్ నేతలు ఇచ్చిన నోటీసు నిబంధనల ప్రకారం లేదంటూ ఏపీ స్పీకర్ వీరి నోటీస్ ను తిరస్కరించారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి వచ్చే ఆదేశాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న భావనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. కానీ.. అందుకు భిన్నంగా సుప్రీం తాజాగా చేసిన వ్యాఖ్యలతో.. తమ పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న అంశంపై హైకోర్టులో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లే.