Begin typing your search above and press return to search.

వీవీపాట్ లెక్కింపుపై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   26 March 2019 5:37 AM GMT
వీవీపాట్ లెక్కింపుపై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు!
X
వీవీపాట్ ల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నేతృత్వంలో 21 పార్టీల‌కు చెందిన నేత‌లు వేసిన పిల్ పై సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఓట్ల లెక్కింపు వేళ క‌నీసం 50 శాతం వీవీ పాట్ ల‌ను లెక్కించాల‌న్న‌ది ఏపీ సీఎం చంద్ర‌బాబు అండ్ కో విన్న‌పం. దీనిపై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఉద్దేశించి సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గోగాయి.. జ‌స్టిస్ దీప‌క్ గుప్తాల‌తో కూడిన ధ‌ర్మాసం విచార‌ణ జ‌రుపుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేస్తున్న విధానంలో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఒక పోలింగ్ బూత్ కు చెందిన వీవీ పాట్ ర‌శీదుల‌ను మాత్ర‌మే లెక్కిస్తున్నారు. అయితే.. ఈ సంఖ్య‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. 50 శాతం వీవీ పాట్ ల ర‌శీదుల‌ను లెక్క వేయాల‌న్న‌ది బాబు అండ్ కో వాద‌న‌.

దీనిపై సుప్రీంకోర్టు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పిన డిప్యూటీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సందీప్ జైన్.. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఏర్పాట్లు సంతృప్తిక‌రంగా ఉన్నాయ‌ని.. మార్పులు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ధ‌ర్మాస‌నం.. ప్ర‌స్తుత ఏర్పాట్లు సంతృప్తిక‌రంగా ఉన్నాయి.. మార్పులు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న భావ‌న‌కు ఎన్నిక‌ల సంఘం ఉంటే.. ఆ మేర‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కోర‌టంతో పాటు.. ఆ సంతృప్తికి కార‌ణం ఏమిటో కూడా అందులో పేర్కొనాలి చెప్పింది.

ఈ అఫిడ‌విట్ ను ఈ నెల 28 సాయంత్రం 4 గంట‌ల లోపు స‌మ‌ర్పించాల‌ని పేర్కొంది. ఎవ‌ర్నో అనుమానిస్తున్నార‌న్న ప్ర‌శ్న కంటే కూడా ఓట‌ర్ల‌ను సంతృప్తి చెంద‌టం ముఖ్యంగా సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఎన్నిక‌ల సంఘం సంతృప్తిక‌రంగా ఏర్పాట్లు ఉన్నాయ‌న్న దానిపై సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

దీని ప్ర‌కారం.. ‘‘ప్రస్తుత విధానం బాగా పనిచేస్తోందని భావిస్తే తొలుత మీకు మీరుగానే ఎందుకు వీవీపాట్‌లను ఏర్పాటు చేయలేదు. వీటిని ఏర్పాటు చేయాలని గతంలో కోర్టు ఎందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది? వీటిపై జ‌డ్జిలు ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది? కోర్టు సూచనను మీరు అప్పట్లో వ్యతిరేకించారు కూడా. అప్పట్లో వద్దన్నా దాన్ని అమలు చేస్తున్నారు కదా! న్యాయ వ్యవస్థ సహా ఏ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందకుండా తనకు తానుగా అడ్డంకులు కలిగించుకోకూడదు. మెరుగుపడడానికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి’’ అంటూ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. మ‌రి.. సుప్రీం కోరిన‌ట్లుగా ఎన్నిక‌ల సంఘం దాఖ‌లు చేసే అపిడ‌విట్ లో ఏం చెబుతార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంటగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.