Begin typing your search above and press return to search.
కాశ్మీర్ పై తేల్చేస్తున్నారు.. సుప్రీంలో ఉత్కంఠ
By: Tupaki Desk | 25 Feb 2019 6:43 AM GMTకాశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏను భారత ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కొందరు ఇటీవలే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సోమవారం దీనిపై సుప్రీంలో విచారణకు రానుంది.
అయితే సుప్రీం తీర్పులో ఏమైనా అనుకోని పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేలా కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. దాదాపు 100 కంపెనీల పారా మిలటరీ బలగాలను కాశ్మీర్ కు తరలించింది. పుల్వామా దాడితో ఇప్పటికే కాశ్మీర్ అష్టదిగ్భంధనం కాగా.. ఇప్పుడు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. జమాతే ఇస్లామీ జమ్మూకాశ్మీర్ సంస్థ అధినేత అబ్దుల్ హమీద్ ఫయాజ్ సహా వివిధ సంస్థలకు చెందిన దాదాపు 140 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ తీర్పుపై ప్రపంచ వ్యాప్తంగా దృష్టి నెలకొంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేంద్రం కాశ్మీర్ కు బీఎస్ ఎఫ్ ను పంపించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో భాగంగానే బలగాలను పంపినట్లు కేంద్రం చెబుతోన్నా వేర్పాటు వాదులు మాత్రం కేంద్రం నిర్బంధ వైఖరిపై మండిపడుతున్నారు.
కేంద్రం చర్యలను నిరసిస్తూ కాశ్మీర్ లో నిరసనల స్వరాన్ని ప్రతిపక్షాలు పెంచుతున్నాయి. వేర్పాటు వాదులతో ఏర్పడిన జేఏసీ జేఆర్ ఎల్ ఆదివారం బంద్ కు పిలుపునిచ్చింది. జమాతే ఇస్లామీకి చెందిన వారిని అరెస్ట్ చేయడంతో ఆ సంస్థ తీవ్రంగా తప్పుపట్టింది. ముందస్తు అరెస్ట్ లపై పీడీపీ అధినేత్రి - మాజీ సీఎం మెహబూబా మండిపడ్డారు. వ్యక్తులను నిర్బంధించినా వారి భావాలను అదుపు చేయలేరని విరుచుకుపడ్డారు.