Begin typing your search above and press return to search.
త్వరలో వాట్సప్ పై ఇండియాలో నిషేధం
By: Tupaki Desk | 25 Jun 2016 11:33 AM GMTఅంతర్జాత వేదికను కొత్త పుంతలు తొక్కించి, కోట్లాది మందికి చేరువైన వాట్సప్ త్వరలో నిషేధానికి గురికానుందా! అంటే అవుననే సంకేతా లొస్తున్నాయి. హర్యానాకు చెందిన సామాజిక కార్యకర్త సుదీర్ యాదవ్ వాట్సప్ - వైబర్ లపై నిషేధం విధించాలని శుక్రవారం సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ సామాజిక సందేశాల అప్లికేషన్లు దేశ భద్రతకు చేటు అని ఆయన తన పిటీషన్లో తెలిపారు.
వాట్సాప్ అప్లికేషన్లు సందేశాలను ఎన్‌క్రిప్షన్ చేసి పంపుతున్నాయని, వీటితో ఉగ్రవాదులు చేరవేసే సమాచారాన్ని దర్యాప్తు అధికారులు చేధించడం అసాధ్యమని ఆరోపించారు. సూపర్ కంప్యూటర్ల సాయంతో ఒక్క 256-బిట్ సందేశాన్ని డీక్రిప్షన్ చేయాలంటే వందల సంవత్సరాలు పడుతుందని సుదీర్ వివరించాడు. సందేశాలను ఎన్ క్రిప్షన్ చేస్తున్న వాట్సప్ - వైబర్ - టెలిగ్రామ్ - హైక్ - సిగ్నల్ అప్లికేషన్లను వెంటనే నిషేధించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. కాగా, ఈ కేసును 29న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచీ విచారించనుంది.
కాగా సందేశాలను గానీ, విషయాలను గానీ సామాన్యుడికి అర్థమయ్యే భాష నుంచి కంప్యూటర్ భాష(సైఫర్ టెక్ట్స్)లోకి మార్చడాన్ని ఎన్ క్రిప్షన్ అంటారు. బైనరీ విలువలతో కూడి అర్థం కాని రీతిలో ఉంటుంది. దీన్ని డీక్రిప్షన్ చేయాలంటే పాస్‌వర్డ్ లేక సెక్యూరిటీ కీ ఉండాల్సిందే. వాట్సప్ లాంటి సందేశాల అప్లికేషన్లు వాడే ఎన్ క్రిప్షన్ తో సందేశం పంపించే వ్యక్తికి, అందుకున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఈ సందేశాలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉండదు. చేయాలనుకున్నా ఇప్పట్లో అసాధ్యమే. తాజా పరిణామల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని టెక్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. వాట్సాప్ ను దేశంలో నిషేదించినా నిషేధించొచ్చని భావిస్తున్నారు.