Begin typing your search above and press return to search.

నేటితో తేలిపోనున్న రవి ప్రకాష్ భవితవ్యం!

By:  Tupaki Desk   |   28 May 2019 6:25 AM GMT
నేటితో తేలిపోనున్న రవి ప్రకాష్ భవితవ్యం!
X
తను ఏ తప్పూ చేయలేదని అంటూనే.. అజ్ఞాతంలో ఉన్న టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాష్ భవితవ్యం నేటితో తేలిపోనుంది. తనపై నమోదు అయిన కేసులు అక్రమం, తను ఏ తప్పూ చేయలేదని చెప్పుకుంటున్నారీయన. అదే విషయాన్ని పోలీసులను కలిసి చెప్పడానికి మాత్రం వెనుకాడుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే ఈ పరారీలో ఉన్నాడు. కేసులు నమోదు అయిన తొలి రోజే పరార్ అయిన ఈయన ఆ
తర్వాత ఒక సారి టీవీ నైన్ తెర మీదే కనిపించారు.

తను ఏ తప్సూ చేయలేదని, తను పరారీలో లేనట్టుగా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత మాత్రం మళ్లీ పరార్ అయ్యాడు రవి ప్రకాష్. ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో విడుదల చేశాడు. తప్పంతా పోలీసులదే అని రవి ప్రకాష్ తేల్చాడు ఆ వీడియోలు. మరి తప్పు చేయనప్పుడు పరారీలో ఎందుకు ఉన్నట్టు అనే అంశం గురించి మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు.

ఆ సంగతలా ఉంటే.. పైకి ఇలాంటి కబుర్లు చెబుతూ మరోవైపు ముందస్తు బెయిల్ ప్రయత్నాలు మాత్రం రవి ప్రకాష్ చేస్తూ ఉన్నాడు. ముందుగా ఆ అంశంలో హై కోర్టుకు వెళ్లారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తనపై కేసులు కొట్టేయాలని కోరారు. అయితే ఆ పిటిషన్ ను కోర్టు విచారణకే స్వీకరించలేదు.దాన్ని కొట్టి వేసింది.

అనంతరం ముందస్తు బెయిల్ కోసం హై కోర్టునే ఆశ్రయించారు. అయితే కోర్టు అందుకు నిరాకరించింది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు సూచించింది. అలా హై కోర్టులో వరసగా ఎదురుదెబ్బలు తగిలినా రవి ప్రకాష్ ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూ ఉన్నాడు.

ముందస్తు బెయిల్ కోరుతూ ఏకంగా సుప్రీం కోర్టులో రవి ప్రకాష్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఆ పిటిషన్ మంగళవారమే విచారణకు రానుంది. సుప్రీం కోర్టులో గనుక రవి ప్రకాష్ పిటిషన్ తిరస్కరణకు గురి అయితే ఆయన లొంగిపోక తప్పకపోవచ్చు.

కేసుల విచారణను ఎదుర్కొనడానికి ఆయన లొంగిపోవాల్సి ఉండొచ్చు. లొంగికపోకపోతే ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అరెస్టుకు కూడా అందకూడదు అనుకుంటే రవి ప్రకాష్ ఏ విదేశంలోనో సెటిలవ్వాల్సి ఉంటుంది. రవి ప్రకాష్ భవితవ్యం అంతా సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు మీదే ఆధారపడి ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.