Begin typing your search above and press return to search.
‘సర్దార్ జోకుల’పై సుప్రీం సంచలన తీర్పు
By: Tupaki Desk | 7 Feb 2017 3:15 PM GMTచాలా దేశాల వారితో పోలిస్తే భారతీయులకు హాస్యచతురత ఎక్కువ. అయితే.. ఇందులో కాస్తంత తప్పు పట్టాల్సిన విషయం ఏమిటంటే.. కొన్ని వర్గాల వారిని.. కొన్ని ప్రాంతాల వారిని చులకన చేసేలా జోకులు పేల్చటం ఎప్పటి నుంచో ఉన్నదే. మారుతున్న కాలానికి తగ్గట్లే ఇప్పుడెవరూ.. తమ వర్గాన్ని.. తమకు చెందిన వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఒప్పుకోవటానికి ఏ మాత్రం సిద్ధంగా లేరనే చెప్పాలి. ఈ ధోరణే.. ఒకరిని సుప్రీంకోర్టు తలుపు తట్టేలా చేసింది.
జోకులన్న వెంటనే.. సర్దార్ జోకులు చటుక్కున గుర్తుకు వస్తాయి. మందమతులుగా.. బఫూన్లుగా.. తెలివితక్కువ వాళ్లుగా చెబుతూ వారి మీద పేల్చే జోకులు అన్ని ఇన్ని కావు. దేశంలో ఇంతమంది ఉన్నా.. సర్దార్జీల మీద వేసే జోకులు అన్నిఇన్ని కావు. ఇలాంటి జోకులు తమ మనోభావాల్నిదెబ్బ తీయటంతో పాటు.. తమ మనసుల్ని గాయపరుస్తాయని.. ఇలా జోకులు వేసే వెబ్ సైట్ల మీదా.. సంస్థల మీదా.. వ్యక్తుల మీద కేసులు బనాయించి వారిని కఠినంగా శిక్షించాలంటూ హర్వీందర్ చౌదరి అనే న్యాయవాది ఒకరు కేసు వేశారు.
దీనిపై విచారించిన కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. సర్దార్జీలపై వేసే జోకుల్ని అడ్డుకట్ట వేయటం సాధ్యం కాని పనిగా తేల్చేసిన కోర్టు.. అలాంటి విషయాలపై మార్గదర్శకాల్ని జారీ చేయలేమని తేల్చి చెప్పింది. నైతికపరమైన మార్గదర్శకాల్ని జారీ చేయలేమని.. ఇలాంటి అంశాలపై ఆదేశాలు జారీ చేసి వాటిని పాటించేలా చేయటం అసాధ్యమైన పనిగా తేల్చేశారు.
సిక్కులపై సమాజంలో ఎంతో గౌరవం ఉందని.. ఇలాంటి పిటీషన్ల ద్వారా తగ్గించుకోవద్దనన్న సూచన చేసిన కోర్టు.. మార్గదర్శకాని జారీ చేసినా.. వాటిని ఎలా అమలు చేస్తాం? ఎవరు వాటిని పాటిస్తారు? అంటూ సూటిగా ప్రశ్నించింది. సర్దార్జీలపైజోకులు వేసే వారికి ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధించాలని కోరిన పిటీషనర్ వాదనను తోసిపుచ్చింది. సర్దార్జీజోకులపై గైడ్ లైన్స్ ను జారీ చేయలేమని తేల్చేసిన కోర్టు.. తమ ఆదేశాలకు సంబంధించి మరింత వివరంగా ఆర్డర్ ను మార్చి 27న జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/