Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ పై కేజ్రీ విజ‌యం..సుప్రీం తీర్పు!

By:  Tupaki Desk   |   4 July 2018 10:10 AM GMT
గ‌వ‌ర్న‌ర్ పై కేజ్రీ విజ‌యం..సుప్రీం తీర్పు!
X
గ‌త నాలుగేళ్లుగా ఢిల్లీ సీఎం అర‌దింద్ కేజ్రీవాల్ - ప్ర‌ధాని మోదీ ల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన దేశ రాజ‌ధాని ఢిల్లీపై కూడా త‌మ ప‌ట్టు ఉండాల‌ని మోదీ స‌ర్కార్ భావించింది. అయితే, రాజ్యాంగం ప్ర‌కారం ఢిల్లీ సీఎంగా త‌న‌కు సంక్ర‌మించిన హ‌క్కుల విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుంటే తాను చూస్తూ ఊరుకోబోన‌ని కేజ్రీ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే, కొంత‌కాలం క్రితం ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్‌ బైజాల్ వైఖ‌రికి నిర‌స‌న‌గా కేజ్రీ నిర‌స దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 9 రోజుల పాటు అనిల్ ఇంట్లో కేజ్రీ ధర్నా చేయ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేజ్రీకి ప‌లువురు ముఖ్యమంత్రులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. అనిల్ ను అడ్డుపెట్టుకుని రాష్ట్ర రాజ‌కీయ వ్య‌వహారాల్లో కేంద్రం తలదూరుస్తోంద‌ని కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అనిల్ వ్యవహరిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో మంత్రిమండలికి సహరించట్లేదని కేజ్రీ మండిప‌డ్డారు. దీంతో, ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ నేప‌థ్యంలో తాజాగా అరవింద్‌ కేజ్రీవాల్ కు ఊరట లభించేలా సుప్రీం తీర్పునిచ్చింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఎలాంటి స్వతంత్ర అధికారాలు ఉండవని, మంత్రి మండలి నిర్ణయానికి ఎల్జీ కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ బుధ‌వారం నాడు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ కేజ్రీ ట్వీట్ చేశారు. ఇది ఢిల్లీ ప్రజలు సాధించిన ఘన విజయమని, ఇన్నాళ్లకు ప్రజాస్వామ్యం గెలిచిందని కేజ్రీ ట్వీట్ చేశారు.

తాజాగా సుప్రీం తీర్పుతో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఊరట లభించింది. ఎల్జీ దూకుడుకు క‌ళ్లెం వేస్తూ...సుప్రీం కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించింది. ఢిల్లీ పరిపాలన అధికారాలపై లెఫ్టినెంట్‌ గవర్నర్ కు ఎలాంటి స్వతంత్ర అధికారాలు ఉండవని, మంత్రి మండలి నిర్ణయానికి ఎల్జీ కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 239ఏఏను అనుసరించి రాష్ట్రపతికి నివేదించాలని సూచించింది. సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని సూచించింది. ప్రభుత్వ విధులకు ఆటంకం క‌లిగించేలా లెఫ్టినెంట్‌ గవర్నర్ ప్ర‌వ‌ర్తించ‌కూడ‌ద‌ని పేర్కొంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమ‌ని, మిగిలిన రాష్ట్రాలకు ఉన్న అధికారాలు ఢిల్లీకి ఉండవని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో కేంద్రంపై కేజ్రీ నైతికంగా విజ‌యం సాధించిన‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ తీర్పుతో కేజ్రీకి పాలనాపరంగా మరింత స్వేచ్ఛ ల‌భించిన‌ట్ల‌యింది.