Begin typing your search above and press return to search.

కష్టపడైనా సరే భర్త భరణం కట్టాల్సిందే.. తేల్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   7 Oct 2022 4:25 AM GMT
కష్టపడైనా సరే భర్త భరణం కట్టాల్సిందే.. తేల్చిన సుప్రీం
X
విడిపోయిన వేళ భార్యకు భర్త ఇచ్చే భరణం మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆదాయం ఉన్నా లేకున్నా భార్య బిడ్డలకు భరణం చెల్లించాల్సిందేనంటూ సుప్రీం స్పష్టం చేసింది. పన్నెండేళ్లుగా సాగుతున్న ఒక కేసుకు సంబంధించిన తీర్పును ఇచ్చే వేళ.. భరణంపై ఆసక్తికర వ్యాఖలు చేసింది. భరణం భర్తకు కోర్టు వేసే శిక్ష కాదని.. అది భార్య పట్ల పవిత్రమైన బాధ్యతగా అభివర్ణించింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి.. జస్టిస్ బేలా.ఎమ్. త్రివేణీలతో కూడిన బెంచ్ ఆదేశాలు ఇవ్వటంతో పాటు.. సంపాదన ఉన్నా లేకున్నా భార్యబిడ్లకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

తనతో విడిపోయిన మాజీ భార్యకు భరణం చెల్లించే విషయంలో భర్త తనకు ఆదాయం లేదని.. తన వ్యాపారం దెబ్బ తిన్నదని.. సంపాదన లేని కారణంగా మాజీ భార్య.. పిల్లలకు భరణం చెల్లించలేనంటూ సుప్రీంను ఆశ్రయించారు.

దీనికి వ్యతిరేకంగా పోరాడిన మాజీ భార్య పన్నెండేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసు విచారణ తాజాగా జరిగింది. ఈ సందర్భంగా భరణం భర్తకు వేసే శిక్షగా భావించకూడదని పేర్కొన్నారు.

భరణం ద్వారా ఆహారం.. దుస్తులు.. నివాసం లభించాలన్నదే ఉద్దేశంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కేసులో భర్త స్ట్రాంగ్ గా ఉండటంతో పాటు అతడికి ఆదాయం కూడా బాగానే వస్తోందని.. భార్య బిడ్డల్ని పోషించే స్థితిలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. నిర్లక్ష్యంతో భరణం చెల్లించకుండా ఉండాలన్న ఉద్దేశంతో భర్త ఉన్నట్లుగా తాము నిర్దారణకు వచ్చినట్లు చెప్పారు. భరణం విషయంలో సుప్రీం తాజా ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.