Begin typing your search above and press return to search.
తమిళనాడుకు ప్రభుత్వానికి సుప్రీం షాక్
By: Tupaki Desk | 2 Dec 2015 10:14 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల విడుదలపై హైడ్రామా నడుస్తోంది. నిందితులను కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని విడుదల చేసేందుకు ఒకపక్క సన్నాహాలు చేస్తుంటే.. మరో పక్క కేంద్రం అనుమతి తప్పనిసరి అని `సుప్రీం` ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెబుతోంది. ప్రస్తుతం ఇదే విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అంతేగాక ఈ కేసులో కొంత సంయమనం పాటించాలని సుప్రీం ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. తొందరపడి ఎటువంటి చర్యలూ తీసుకోకూడదని సున్నితంగా హెచ్చరించింది.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా ఈ వివాదం నడుస్తోంది. వారి విడుదలపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే వారి విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయకూడదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని కోరింది. తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీం ఈ తీర్పు వెలువరించింది.
మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులు నళిని, మురుగన్ ల కుమార్తె హరిత్ర రాహుల్ గాంధీని క్షమాపణ కోరింది. చేసిన నేరానికి తన తల్లిదండ్రులు శిక్ష అనుభవించటంతో పాటు, పశ్చాత్తాపం చెందారని, వారిని క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా, గతంలో వారిని విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ గాంధీ హత్య అనేది భారతదేశం మీద జరిగిన దాడి అని, ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దని సుప్రీంను కోరింది. ఆ సందర్భంలోనూ సుప్రీం ఇదే విధంగా స్పందించింది.