Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు సుప్రీం కోర్టు వార్నింగ్.. మేం చెప్పినా అమ‌లు చేయ‌రా? అంటూ.. ఫైర్‌!

By:  Tupaki Desk   |   11 Oct 2022 12:43 PM GMT
తెలంగాణ‌కు సుప్రీం కోర్టు వార్నింగ్.. మేం చెప్పినా అమ‌లు చేయ‌రా? అంటూ.. ఫైర్‌!
X
ఏపీ విద్యుత్ ఉద్యోగుల విష‌యంలో తెలంగాణ అనుస‌రిస్తున్న వైఖ‌రిపై సుప్రీం కోర్టు తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయింది. తాము చెప్పిన త‌ర్వాత కూడా.. జ‌స్టిస్ ద‌ర్మాధికారి క‌మిష‌న్ నివేదిక‌ను య‌థాత‌థంగా అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై నిప్పులు చెరిగింది. అంతేకా దు.. ఇదే చివ‌రి ఛాన్స్ అని.. దీనిని అమలు చేయ‌క‌పోతే.. కోర్టు ధిక్క‌ర‌ణ చ‌ర్య‌లు సైతం త‌ప్ప‌వ‌ని తలంటేసింది.

ఏంటి వివాదం?

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. అన్ని శాఖల ఉద్యోగుల‌ను జ‌నాభా ప్రాతిప‌దిక‌న విభ‌జించారు. దీని ప్ర‌కారం.. విద్యుత్ శాఖ‌లోని ఉద్యోగు ల‌ను కూడా.. రెండు రాష్ట్రాల‌కు విబ‌జించారు. అయితే.. దీనిని త‌ప్పుబ‌డుతూ.. తెలంగాణ ప్ర‌బుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో జ‌స్టిస్ ధ‌ర్మాధికారి నేతృత్వంలో కేంద్రం ఒక క‌మిటీని ఏర్పాటు చేసి విద్యుత్ ఉద్యోగుల విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను అప్పగించింది. దీంతో ధ‌ర్మాధికారి క‌మిటీ రెండు రాష్ట్రాల‌కు చెందిన ఉద్యోగుల‌ను పిలిచి.. హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా బేటీ అయి.. చ‌ర్చించింది. అదేవిధంగా ఇరు రాష్ట్రాల‌కు చెందిన ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు? వారి నేటివిటీ ఏంట‌నేది కూడా చ‌ర్చించి.. చివ‌ర‌కు నివేదిక ఇచ్చింది.

దీనిని ఏపీ అమ‌లు చేసి.. తెలంగాణ నుంచి వ‌చ్చిన 8 వంద‌ల మంది పైచిలుకు ఉద్యోగుల‌కు నియామ‌కాలు ఇచ్చింది. వీరిలో కొంద‌రు తెలంగాణ నేటివిటీ ఉన్నారు కూడా ఉన్నారు. అయితే.. ఈ నివేదిక అమ‌లుపై తెలంగాణ పేచీ పెట్టింది. త‌మ‌కు అంత ఆర్థిక స్తోమ‌త లేద‌ని.. ఇంత మంది ఉద్యోగుల‌ను తీసుకునే ప‌రిస్థితి లేద‌ని.. జీతాలు కూడా ఇవ్వ‌లేమ‌ని.. పేర్కొంటూ.. కొన్నా ళ్లు నాన్చివేత ధోర‌ణి అవ‌లంభించింది. అస‌లు ధ‌ర్మాధికారి ఎవ‌డు? అంటూ.. కొన్నాళ్లు ఉద్యోగులు ప్ర‌శ్నించారు. మొత్తానికి ఇది సుప్రీం కోర్టుకు వెళ్లింది.

దీనిపై సుదీర్ఘ విచార‌ణ‌ల అనంత‌రం.. ధ‌ర్మాధి కారి క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను అమ‌లు చేయాల్సిందేన‌ని కోర్టు చెప్పింది. అయిన‌ప్ప‌టికీ..84 మంది ఉద్యోగుల‌ను తీసుకునేది లేద‌ని తెలంగాణ తేల్చి చెప్పింది. ఇక‌.. అప్ప‌టి నుంచి వారికి ఎలాంటి వేత‌నాలు కూడా ఇవ్వ‌డం లేదు. అయితే.. ఇటీవ‌ల రెండు నెల‌ల జీతం ఇస్తూ.. తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.

తాజాగా ఏం జ‌రిగిందంటే..

విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఆదేశాలు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వంపై.. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆంధ్ర నుంచి వచ్చిన పలువురికి నియామక ఉత్తర్వులు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం నడుచుకోవాలని పలుమార్లు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం కావాలనే అమలు చేయడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇది కోర్టు ధిక్కారమేనని, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ అయిన 84 మందికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదిక అమలు చేయాలని, ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. ఈ నెల 31 న ఈ అంశంపై మరోసారి సమీక్షిస్తామంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.