Begin typing your search above and press return to search.
జీతాలు చెల్లించాల్సిందే: తెలంగాణకు షాకిచ్చిన సుప్రీంకోర్టు
By: Tupaki Desk | 1 May 2020 6:30 PM ISTఉమ్మడిగా ఉన్న రాష్ట్రం తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ గా విడిపోయి దాదాపు ఏడేళ్లవుతోంది. అయినా ఇంకా ఈ రెండు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు పరిష్కారం కాలేదు. కొన్ని విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఎటు తెగడం లేదు. మధ్యవర్తిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విషయమై ఇంకా ఎటు తేలలేదు.
విద్యుత్ ఉద్యోగుల విభజన పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కూడా విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేసిన 584 మందికి తెలంగాణ విద్యుత్ సంస్థలే జీతాలు చెల్లించాలని ఆదేశించింది. కేటాయింపులపై భేదాభిప్రాయాలు ఉంటే ధర్మాధికారి కమిటీ వద్దే సరి చేసుకోవాలని సూచించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో వారికి జీతాలు తెలంగాణ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో మెరిట్స్ జోలికి వెళ్లలేమని కోర్టు తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ జెన్‌కో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ వాయిదా పడింది.