Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్లపై సుప్రీం జోక్యం.. కేంద్రం అభ్యంతరం!
By: Tupaki Desk | 10 May 2021 4:30 PM GMTకరోనా వ్యాక్సినేషన్ విషయంలో కోర్టుల జోక్యం అనవసరమని కేంద్రం స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటే ఊహించని.. అనాలోచిత పరిణామాలకు దారితీస్తుందని. ఈ మేరకు కరోనా వ్యాక్సిన్ ధరలు, కరోనా వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలు వినిపించింది.
దేశంలో దారుణ కరోనా పరిస్థితులపై సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు వ్యాక్సిన్ ధరలు, కొరత విషయంలో కేంద్రప్రభుత్వంపై ప్రశ్నలు సంధించింది. కేంద్రానికి, రాష్ట్రాలకు వేరు వేరు ధరలు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. వ్యాక్సిన్ ధరల్ని మరోసారి పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది.
అయితే దేశం ఇంత అల్లకల్లోలంగా ఉండి వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ఇంత గందరగోళంగా మారిన ఈ పరిస్థితుల్లో కేంద్రం తీరు అందరికీ షాక్ కు గురిచేస్తోంది. ఈ విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం అనవసరమని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం సంచలనమైంది.
వ్యాక్సిన్లపై నిర్ణయాలను తమకు వదిలేయాలని.. ఈ నిర్ణయాన్ని ప్రజల ప్రయోజనార్థం మెడికల్, సైంటిఫిక్ నిపుణుల సూచన మేరకు తీసుకున్నామని అఫిడవిట్ లో కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.