Begin typing your search above and press return to search.
కుమారులతో సమానంగా ఆడబిడ్డలకు తండ్రి ఆస్తి..: సుప్రీం తీర్పు
By: Tupaki Desk | 22 Jan 2022 5:40 AM GMTతన ఆస్తులపై వీలునామా రాయకుండా తండ్రి చనిపోతే ఆ ఆస్తులు ఎవరికి చెందుతాయి.. ? కుమారులకు చెందుతాయా.. ? లేక కుమార్తెలకు వర్తిస్తాయా.. ? అంతేకాకుండా తండ్రి సోదరుల కుమారులకు ఆస్తుల్లో వాటా ఉంటుందా.. ? ఇలాంటి సందేహాలకు సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పునిచ్చింది. తండ్రి వీలునామా రాయకపోయినా ఆ ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా రావాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి మరణించినా కుమార్తెలకు సమాన హక్కు ఉంటుందని తెలిపింది. 2005 నాటి నుంచి తండ్రి బతికున్నా.. లేకున్నా.. తండ్రి ఆస్తిని కుమార్తెలకు సమాన వాటా పంచాల్సిందేనని తెలిపింది.
హిందూ వారసత్వ చట్టానికి కీలకమైన తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. ఈ తీర్పు ప్రకారం 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి బతికున్నా.. లేకున్నా.. ఆ ఆస్తిలో కుమార్తెకు సమాన వాటా వస్తుంది. తండ్రి ఆస్తులపై దాయాదుల కంటే ఆయన కుమార్తెలకే తొలి హక్కు ఉంటుందని తెలిపింది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూదాఖలైన ఒక పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే తన కుమార్తెకు ఆస్తిపై హక్కు ఉంటుందా.. ? అనే సందిగ్ధంపై విచారణ జరిపింది.
ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై వారసులందరికీ సమాన హక్కు ఉంటుందని తెలిపింది. అదే మహిళకు భర్త, అత్తమామలపై వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే భర్త వారసులకు హక్కులు లభిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 2020లో ఆడబిడ్డలకు సమాన హక్కు ఉంటుందని తీర్పు వెలువరించిన సుప్రీం తాజాగా వాటి ఆధారంగా కీలక తీర్పునిచ్చింది. గతంలో తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా ఉంటుందని స్పష్టం చేసింది. తండ్రి లేదా తల్లి మరణించినా ఇది వర్తిస్తుందని తెలిపింది. కుమారుడితో సమానకంగా కుమార్తెకు కూడా ఉంటుందని పేర్కొంది.
2005 కంటే ముందే తండ్రి లేదా తల్లి మరణించినా కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని అప్పటి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మానం తీర్పు వెలువరించింది. సవరణ తేదీ నాటికి కుమార్తె తండ్రి జీవించి ఉన్నా, లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుపై మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇక తాజా తీర్పు ప్రకారం వీలునామా రాయకపోయినా కుమార్తెకు వాటా వర్తిస్తుందని తెలిపింది.