Begin typing your search above and press return to search.
ఓబీసీ రిజర్వేషన్ల నిలిపివేత పై సుప్రీం కీలక ఆదేశాలు
By: Tupaki Desk | 28 Dec 2021 11:30 AM GMTమధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సూచించింది. అలాగే ఎన్నికలను 4 నెలల పాటు వాయిదా వేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. మూడు నెలల్లో ఓబీసీ కమిషన్ సిఫార్సలను సమర్పించాలని కోరింది. సోమవారం కేంద్ర సుప్రీంలో పిటిషన్ వేసిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘ఎస్సీ ఎస్టీ ఓబీసీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పించకపోతే వారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరదు’ అని కేంద్రం సుప్రీంలో వేసిన పిటిషన్లో పేర్కొంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరింది. ఒక్కసారి రిజర్వేషన్లు అమలు చేస్తే ఆయా వర్గాలు ప్రాతినిథ్యం కోల్పోతాయని తెలిపింది.
మధ్యప్రదేశ్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే ముందు ఆయా వర్గాల్లో ముందుగా సర్వేలు నిర్వహించారు. వెనుకబడిన వర్గాల్లో కమిషన్ ద్వారా దర్యాప్తు చేపట్టాలి. ఆ తరువాత కమిషన్ సంతృప్తి చెందిన తరువాత దానిని త్రిసభ్య ధర్మాసనం సమర్థించాల్సి ఉంటుంది’ అని 2010లో రాజ్యాంగ ధర్మాసం వెలువరించిన తీర్పును సుప్రీం కోర్టు ఈ నెల 17 నాటి ఆదేశాల్లో పేర్కొంది. అంతకుముందు ఈనెల 15న మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై ఇలాంటి తీర్పునే ఇచ్చింది.
స్థానికి సంస్థల ఎన్నికల విషయంలో ఈ రెండు రాష్ట్రాల విషయంలో తుది విచారణను జనవరి 17కు వాయిదా వేసింది. ఓబీసీ కేటగిరికి కేటాయించిన సీట్లను జనరల్ విభాగంలో కలుపుతూ తిరిగి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కేంద్రం సుప్రీంలో పిటిషన్ వేయడంతో దానిని ఉపసంహరించుకోవలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మధ్యప్రదేశ్లో మరో నాలుగు నెలల పాటు ఓబీసీ కమిషన్ దర్యాప్తు చేపట్టి తుది నివేదిక సమర్పించిన తరువాత విచారణ చేపట్టే అవకాశం ఉంది.