Begin typing your search above and press return to search.

‘గే’ మ్యారేజ్ పై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 12:39 PM GMT
‘గే’ మ్యారేజ్ పై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు..!
X
భారతదేశంలో గే మ్యారేజ్ కు చట్టబద్దత లేదనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొందరు స్వలింగ సంపర్కులు మ్యారేజ్ చేసుకుంటూ వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్నారు. పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా షేర్ చేస్తుండటంతో అవి కాస్తా వైరల్ గా మారుతున్నారు. ఈ క్రమంలోనే గే మ్యారేజ్ పై ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

తాజాగా సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కుల వివాహాలపై కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గే మ్యారేజెస్ కు చట్టబద్ధత కోసం దాఖలైన పిటిషన్లను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టుకే బదిలీ చేశారు. ఈ పిటిషన్లపై ఫిబ్రవరి 15లోగా కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీం ఆదేశించింది. గే మ్యారేజెస్ కు సంబంధించిన అన్ని పిటిషన్లు ఒకేసారి మార్చిలో విచారించనున్నట్లు పేర్కొంది.

గే మ్యారేజేస్ పై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా లేదా కోర్టులో వాదనలు విన్పించే పరిస్థితి లేనట్లయితే వారున్న చోటు నుంచే వర్చువల్ గా అయినా వాదించవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్వలింగ సంపర్క వివాహాలపై పిటిషన్లు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరింది. పిటిషనర్లు కోరుతున్న ఏ ఒక్క అంశాన్ని సైతం విడిచిపెట్టకుండా అన్నింటిని కేంద్రం పరిశీలించాలని ధర్మాసనం సూచనలు చేసింది.

దేశంలో ఇటీవలి కాలంలో గే మ్యారేజ్ తరుచూ జరుగుతున్నాయి. తమ వివాహాలకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని స్వలింగ సంపర్కులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే వీటిన్నింటిని ఒకేసారి విచారించేందుకు సుప్రీం ధర్మాసనం రెడీ అవుతోంది. దీంతో సుప్రీంకోర్టు  గే మ్యారేజేస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.