Begin typing your search above and press return to search.

రిజర్వేషన్ల పై రాజకీయ పార్టీల మౌనం

By:  Tupaki Desk   |   23 March 2021 10:30 AM GMT
రిజర్వేషన్ల పై రాజకీయ పార్టీల మౌనం
X
దేశంలో రిజర్వేషన్ల రగడ మొదలైంది. రాష్ట్రాలు పెంచుకుంటూ పోతున్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. తాజాగా 75 ఏళ్లు వచ్చినా దేశంలో రిజర్వేషన్లు అవసరమా అన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ అభిప్రాయాలు రాజకీయ పార్ీలు, ప్రభుత్వాల్లో గుబులు రేపుతున్నాయి.

తాజాగా రిజర్వేషన్లకు బదులుగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యామ్మాయ మార్గాల్లో మేలు చేయగలమా? లేదా అన్న అంశంపై రాష్ట్రాల అభిప్రాయం కోరింది. మారిన పరిస్థితుల దృష్ట్యా రిజర్వేషన్ కోటాలను నిర్ణయించడానికి కోర్టులు ఈ విషయాన్ని రాష్ట్రాలకు వదిలివేయాలన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలకు మరియు 1931 జనాభా లెక్కల ప్రకారం వచ్చిన మండల్ తీర్పునకు వ్యతిరేకంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

సుప్రీంకోర్టు తాజాగా "మహారాష్ట్ర రిజర్వేషన్ల కేసు తీర్పును సమీక్షించింది. వెనుకబాటుతనం నుంచి బయటపడ్డ వారిని ఇంకా రిజర్వేషన్లకు అర్హులుగా గుర్తించడాన్ని నిర్మూలించాలి." అని వ్యాఖ్యానించారు. మరాఠా కోటా కేసులో వాదనలు వింటూ ఈ ప్రకటన చేసింది. "ఉద్యోగాలు మరియు విద్యలో ఎన్ని తరాల రిజర్వేషన్లు కొనసాగుతాయి" అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. "స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచాయి. పేదలకు రాష్ట్రాలు చాలా ప్రయోజనకరమైన పథకాలను కొనసాగిస్తున్నాయి. అణగారిన వర్గాలు రిజర్వేషన్లతో ఆర్థికంగా బలపడ్డాయి.ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వెనుకబడిన కులాలు ముందుకు సాగలేదని మేము అంగీకరించగలము "అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇతరత్రా మార్గాల్లో రిజర్వేషన్లకు ప్రత్యామ్మాయం వారికి మేలు చేసే అవకాశం ఉందా అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు ఎంతమంది సమాధానం చెబుతారో తెలియని పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలపై రాజకీయ పార్టీలు మౌనం వహిస్తున్నాయి. చర్చ మొదలు పెడితే తమ రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న ప్రచారం మొదలవుతుందని.. అంతిమంగా ఇది పార్టీలకు వ్యతిరేకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నాయి.