Begin typing your search above and press return to search.
సీఏఏ పై స్టే కు నిరాకరించిన సుప్రీం !
By: Tupaki Desk | 22 Jan 2020 8:04 AM GMTదేశాన్ని మత ప్రాతి పదికన విభజిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సీఏఏని తీసుకువచ్చారని ఆరోపిస్తూ వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టు లో 144 కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. సీఏఏ పై సుప్రీం లో దాఖలైన మొత్తం పిటిషన్ల పై ఒకేసారి ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు .. సీఏఏ పై స్టే జారీ చేసేందుకు నిరాకరించింది. ఈ చట్టాన్ని అమల్లోకి రాకుండా ఆపాలంటూ దాఖలైన పిటిషన్ల పై నాలుగు వారాల్లోగా సమాధానాన్ని ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీచేసింది. కేంద్రం వాదన వినకుండానే ఈ చట్టాన్ని అమలు కాకుండా స్టే ఇవ్వలేము అని సుప్రీం తేల్చి చెప్పింది. ఈ పిటిషన్లపై అయిదుగురు న్యాయ మూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను ఇస్తుందని తెలిపింది.
కాగా, ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం లో దాఖలైన మొత్తం పిటిషన్లని సీజేఐ ఎస్.ఎ. బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ బుధవారం విచారించింది. ఈ చట్టం లీగల్ కాదని, మౌలిక రాజ్యాంగ వ్యవస్థకు, సమానత్వ హక్కు కు వ్యతిరేకంగా ఉందని పిటిషనర్లు విమర్శించారు. ఈ నెల 10 న అమలులోకి తెచ్చిన ఈ చట్టాన్ని అమలుకాకుండా స్టే ఇవ్వాలని కొందరు సుప్రీం కోర్టుని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీతో బాటు డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఐయుఎంఎల్, ఎంఐఎం సహా నటుడు కమల్ హాసన్ నాయకత్వం లోనిమక్కల్ నీది మయ్యం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే అస్సాం , త్రిపుర రాష్ట్రాలకి సంబంధించిన పిటిషన్ల ని ప్రత్యేకం గా విచారిస్తాం అని ధర్మాసనం తెలిపింది.