Begin typing your search above and press return to search.

వీవీ ప్యాట్లపై సుప్రీం సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   21 May 2019 8:57 AM GMT
వీవీ ప్యాట్లపై సుప్రీం సంచలన తీర్పు
X
చంద్రబాబు సహా 21 ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు కొన్ని రోజుల క్రితం ప్రతీ నియోజకవర్గంలో ఈవీఎంలకు అనుబంధంగా ఉన్న వీవీప్యాట్లలో 50శాతం లెక్కించాలని వేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పోలింగ్ బూత్ లలోని ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8న సుప్రీం కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఇప్పుడా తీర్పును సమీక్షించాలని మరో పిటీషన్ సుప్రీంలో మంగళవారం దాఖలైంది.

వీవీప్యాట్లను 100శాతం లెక్కించాలని మరో పిటీషన్ మంగళవారం దాఖలైంది. అయితే ఇది న్యూసెన్స్ పిటీషన్ అని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

100శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ‘టెక్నోపర్ ఆప్’ అనే సంస్థ సుప్రీం కోర్టులో తాజాగా పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఈ డిమాండ్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పిటీషన్ లో మెరిట్ లేదని స్పష్టం చేసింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని.. ఈ పిటీషన్ వేస్ట్ అని సీరియస్ అయ్యింది. వీవీ ప్యాట్ల లెక్కింపుపై తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

అయితే దేశంలోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా ఈవీఎంల పై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. టీడీపీ సహా 21 ప్రాంతీయ పార్టీల నాయకులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మొదట వీవీ ప్యాట్లనే లెక్కించాలని .. ఆ తర్వాతే ఈవీఎంలను లెక్కించాలని ఈసీని కోరనున్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల మధ్యన తేడాలుంటే నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరనున్నట్టు తెలుస్తోంది.