Begin typing your search above and press return to search.
షిండేకు సుప్రీం షాక్... గుర్తింపు ఇవ్వొద్దు
By: Tupaki Desk | 4 Aug 2022 11:30 AM GMTదశ బాగుంటే పాము తాడే అవుతుంది. అదే నిచ్చెనలా మారుతుంది. అలా ఎన్నో మెట్లు ఎక్కేసి ఏకంగా మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయిన ఏక్ నాధ్ షిండే అదే ఊపులో శివసేనకు కూడా అధినేత కావాలనుకున్నారు. తనది కాని పార్టీని ఆయన చీల్చారు. కేవలం అధికారం మత్తులో జోగే వారంతా ఆయన వైపు వచ్చారు. మెజారిటీ వర్గం తనతో ఉంది కాబట్టి తనదే అసలైన పార్టీ అన్న షిండే క్లెయిం చెల్లదనే సుప్రీం కోర్టు అంటోంది.
అంతే కాదు ఒక కీలకమైన మౌలికమైన ప్రశ్నను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ షిండే వర్గానికి సంధించారు. మీరు ఎన్నికైన తర్వాత రాజకీయ పార్టీలను పూర్తిగా విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా అంటూ ఆయన అడిగిన దానికి షిండే తరఫున న్యాయవాది కాదు అని బదులిచ్చినా మౌలికంగా చూస్తే సుప్రీం కోర్టు ఈ ప్రశ్నను ఎందుకు వేసిందో అర్ధమవుతుంది.
ముందు పార్టీ ఉంటేనే ప్రజా ప్రతినిధిగా నెగ్గుతారు ఎవరైనా. ఆ మీదట అధికారం కోసం ఉన్న పార్టీని చీల్చేసి ఆ పవర్ అండతో తనకు చోటు ఇచ్చిన పార్టీయే తన సొంతం అనేలా రాజకీయం చేయడం మీద సుప్రీం కోర్టు నిశిత పరిశీలన చేస్తోంది అని అర్ధమవుతోంది.
ఇక ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. షిండే వర్గానికి అసలైన శివసేనగా గుర్తింపు ఇవ్వవద్దు అంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అదే టైమ్ లో ఈ కేసులో అనేక రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నందున రాజ్యంగబద్ధమైన బెంచ్ కి సిఫార్స్ చేసే విషయాన్ని కూడా తేల్చేందుకు ఈ నెల 8న సుప్రీం కోర్టు ఒక నిర్ణయాన్ని వెలువరిస్తుంది అంటున్నారు.
మొత్తానికి చూస్తే ఇప్పటిదాకా సొంత పార్టీలో వెన్నుపోటుదారుల నుంచి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోని మాజీగా మారిన ఉద్ధవ్ థాక్రేకు ఇది భారీ ఊరట అంటున్నారు. అదే విధంగా శివసేన పార్టీ కూడా మాది అంటూ షిండే వర్గం చేసిన వాదనకు సుప్రీం కోర్టు నుంచి పెద్దగా మద్దతు లభించకపోవడంతో తనది నైతిక విజయం అని అంటున్నారు.
రానున్న రోజుల్లో దీని మీద రాజ్యాంగబద్ధమైన బెంచ్ ఏర్పాటు చేసి మొత్తం విచారణ జరిపితే అది చివరకు తమకే అనుకూలంగా తీర్పు వచ్చేలా ఉంటుందని కూడా భావిస్తున్నారుట. ఏది ఏమైనా నెల రోజుల క్రితం గద్దెనెక్కిన ఏక్ నాధ్ షిండేకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.