Begin typing your search above and press return to search.
సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. వారికీ హక్కులు
By: Tupaki Desk | 14 Jun 2022 7:35 AM GMTసహజీవనానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేసిన జంటకు కలిగిన సంతానం విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు ఓ జంట భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సహజీవనం చేశారంటే వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
కేరళకు చెందిన ఓ జంట సుధీర్ఘకాలం సహజీవనం చేయగా.. వారికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. అయితే ఆ జంట పెళ్లి చేసుకున్నట్లు సాక్ష్యాలు లేని కారణంగా ఇది అక్రమ సంతానం అని.. ఆ సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని పేర్కొంటూ 2009లో కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది. కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఓ జంట దీర్ఘకాలం పాటు సహజీవనం చేశారంటే వారికి వివాహం జరిగినట్టుగానే భావించాలని.. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 144 ప్రకారం ఇదే సూచిస్తోందని పేర్కొన్నారు. దీన్ని ఎవరైనా సవాల్ చేయవచ్చని తెలిపారు.
కానీ వివాహం చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా ఆ సవాల్ చేసినవారిపైనే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్ప వారి బంధాన్ని భార్యాభర్తల్లానే పరిగణించాలని స్పష్టం చేసింది.
ఆస్తి పంపకం దావాల్లో ప్రాథమిక డిక్రీ ఇచ్చిన వెంటనే తుది డిక్రీ జారీకి చర్యలు ప్రారంభించాలంటూ అన్ని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.