Begin typing your search above and press return to search.
చిరంజీవి స్ఫూర్తి.. చరణ్ నా ధైర్యం- సూరి
By: Tupaki Desk | 18 Sep 2019 4:32 PM GMTసైరా కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు? అని ప్రశ్నిస్తే .. ఆర్నెళ్ల పాటు పరిశోధించి మాకు దొరికిన ఆధారాల్ని బట్టి కథను తయారు చేశామని సురేందర్ రెడ్డి తెలిపారు. వందశాతం కథ ఆ క్యారెక్టర్స్ ని డిమాండ్ చేసింది కాబట్టే అమితాబ్- సుదీప్- విజయ్ సేతుపతి వంటి స్టార్లను ఎంచుకున్నాం. నంద్యాల ఎంపీ ఒకరిని కలిసి ఉయ్యాలవాడపై రీసెర్చ్ చేశాను. ఆయన 6వ తరగతి పుస్తకం ఒకటి ఇచ్చారు. అలాగే ఉయ్యాలవాడ ఫోటోతో ఉన్న స్టాంప్ కూడా ఇచ్చారు. ప్రభాకర్ అనే మిత్రుడి ద్వారా చెన్నయ్ నుంచి తెచ్చిన గెజిట్స్ ఆధారంగా కథను తయారు చేశాం... అని తెలిపారు.
ఇంత పెద్ద సినిమాని చేసే ధైర్యం ఎలా వచ్చింది? అన్న ప్రశ్నకు.. సైరాను ఇంత ఇదిగా చేయడానికి చిరంజీవిగారే స్ఫూర్తి. చరణ్ నా వెంట ఉన్నారన్న ధైర్యంతోనే ఈ సినిమా చేయగలిగానని సురేందర్ రెడ్డి అన్నారు.
తెరపై చిరంజీవి అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆ పాత్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అన్న ప్రశ్నకు చరణ్ సమాధానమిచ్చారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ - సురేందర్ రెడ్డి కలిసి చిరంజీవి గారి పాత్రను డిజైన్ చేశారు. ఈ టైమ్ లో ఆయనకు ఇలాంటి గెటప్ కుదురుతుందా లేదా అని భావిస్తే అది ఇంత బాగా కుదరడం అదృష్టం.. అని రామ్ చరణ్ అన్నారు. పవర్ స్టార్ వాయిస్ కేవలం ట్రైలర్ వరకేనా అని ప్రశ్నిస్తే.. అలా పరిమితం కాదు.. సినిమా ఆద్యంతం ఉంటుందని అన్నారు.
దర్శకుడిగా సురేందర్ రెడ్డిని ఎంచుకోవడానికి కారణమేంటి? అని ప్రశ్నిస్తే.. సూరి గురించి ఇప్పుడే చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు చాలా చూస్తూనే ఉన్నాం. ధృవ తర్వాత ఎంటర్ టైన్ మెంట్ ఒక్కటే కాదు.. ఇంకా ఇంటెన్స్ సినిమాల్ని చేయగలరని ఆయన్ని నమ్మాను. ఈ సినిమా చేశాక తనలో కొత్త వ్యక్తిని చూశాను... అని చరణ్ అన్నారు.