Begin typing your search above and press return to search.
మళయాల హీరోకి కేంద్ర మంత్రి పదవి?
By: Tupaki Desk | 21 April 2016 9:45 AM GMTప్రముఖ మళయాల హీరో - పోలీసు పాత్రలకు ప్రసిద్ధిగాంచిన సురేశ్ గోపికి కేంద్ర మంత్రి పదవి వరించబోతోందా? బీజేపీకి ఆయనకు ఊహించని స్థాయి అవకాశమివ్వబోతోందా అంటే కేరళ రాజకీయవర్గాలు అవుననే అంటున్నాయి. మళయాలంలో మంచి ఇమేజి ఉన్న సురేశ్ గోపిని తిరువనంతపురం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయించాలని తొలుత బీజేపీ అనుకుంది. కానీ, ఆయన అందుకు నిరాకరించడంతో అక్కడి నుంచి క్రికెట్ శ్రీశాంత్ ను బరిలో దించారు.
అయితే... కేరళలో ఎలాగైనా ఈసారి బోణీ కొట్టాలని, బలపడాలని బలంగా కోరుకుంటున్న బీజేపీ సురేశ్ గోపీ వంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తులకు పార్టీలో ప్రయారిటీ ఇచ్చి కేరళలో పార్టీ బలోపేతానికి పునాదులేయాలని భావిస్తున్నారు. ఆ క్రమంలో సురేశ్ గోపిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సురేశ్ గోపీని కేంద్ర మంత్రిని చేస్తే కేరళలో బీజేపీకి మంచి బూస్టింగ్ అవుతుందని భావిస్తున్నారు.
ఆయన్ను కేంద్ర మంత్రిని చేయడానికి వీలుగానే ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్నట్లు చెబుతున్నారు. లెక్కకు మిక్కిలి చిత్రాల్లో పోలీసు పాత్రల్లో ప్రేక్షకులను రంజింపజేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సురేష్ గోపీని రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ఇదే సమీకరణం దాగి ఉందని విశ్లేషకులు అంటున్నారు. సురేష్ గోపీ పేరుతో పాటు మరికొందరి పేర్లను పెద్దల సభకు నామిమేట్ చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జాబితాను పంపింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే సురేష్ గోపీ రాజ్యసభ సభ్యుడిగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తరువాత కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో ఆయన్ను మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారని తెలుస్తుంది. ప్రస్తుత ఎన్నికల పరిస్థితి ఎలా ఉన్నా భవిష్యత్తులో కేరళలో పాగా వేయడానికి సురేశ్ గోపీ తమకు లిఫ్టుగా మారుతారని భావిస్తున్నారు.