Begin typing your search above and press return to search.
కేంద్ర మంత్రి సెన్సాఫ్ హ్యూమర్
By: Tupaki Desk | 16 Jun 2017 5:10 AM GMTపనిలో తప్ప అనవసర రాజకీయాల్లో అస్సలు తల దూర్చని నేతగా కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభును చెప్పొచ్చు. మోడీ మంత్రివర్గంలో తనదైన ముద్ర వేసిన అతి కొద్ది మంత్రుల్లో సురేశ్ ప్రభు ఒకరు. తన చేతికి రైల్వే శాఖ వచ్చినప్పటి నుంచి దానికో ప్రత్యేకత ఉండేలా చేయటమే కాదు.. రైల్వే ప్రయాణికులు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడ్డా.. తన దృష్టికి వచ్చిన గంటల్లోనే ఆ సమస్యను పరిష్కరిస్తూ అందరి మనసుల్ని దోచుకుంటున్నారు.
తాజాగా ఏపీలో ఒకేరోజు వ్యవధిలో పది కొత్త ప్రాజెక్టులకు ఓకే చేసిన రైల్వే మంత్రి సురేశ్.. ఏపీకి చేయాల్సినవెన్నో ఉన్నాయని.. అందులో పది మాత్రమే చేశామని చెప్పారు. మరిన్ని చేయాలంటూ కొత్త ఆశలు రేకెత్తించేలా చేశారు. తెనాలిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సురేశ్ ప్రభు తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాటలు అందరి ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయించాయి.
విశాఖ నుంచి అరకు మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా ప్రయాణం చేయాలని సురేశ్ ప్రభు కోరారు అరకు రైల్లో ప్రయాణించిన తర్వాత స్విట్జర్లాండ్ కు ఎవరూ వెళ్లరన్న ఆయన.. దేశంలోని పలు రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల కన్నా మెరుగ్గా తీర్చి దిద్దుతామని వ్యాఖ్యానించారు.
అంత సీరియస్ గా ప్రసంగిస్తూ.. తనలోని సెన్సాఫ్ హ్యుమర్ ను సురేశ్ ప్రభు మిస్ కాలేదు. వేదిక మీద ఉన్న విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వైపు చూస్తూ.. ఓహ్ సారీ అశోక్ జీ (విమానాశ్రయాల కంటే రైల్వేస్టేషన్లు మెరుగ్గా చేస్తానని చెప్పటం.. విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతి రాజును నొప్పించి ఉంటుందేమోనన్న ఉద్దేశంతో) అంటూ వ్యాఖ్యానించటంతో వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రమంత్రి వెంకయ్యలు ఒక్కసారిగా నవ్వేశారు. తాజా ఉదంతం ద్వారా.. తనలోని సెన్సాఫ్ హ్యుమర్‌ను సురేశ్ ప్రభు ప్రదర్శించారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/