Begin typing your search above and press return to search.
ఏపీకి ప్రభు మరో ట్రైన్ గిఫ్ట్
By: Tupaki Desk | 12 July 2016 6:44 AM GMTగడిచిన రెండేళ్లతో పోలిస్తే.. గడిచిన కొద్ది రోజులుగా ఏపీ విషయంలో రైల్వేశాఖ త్వరితగతిన నిర్ణయాల్ని తీసుకుంటోంది. ఏపీ కోటా కింద ఏపీ అధికారపక్షం కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు రాజ్యసభ సీటు కేటాయించటం.. అప్పటి నుంచి ఏపీకి సంబంధించిన కొత్త రైళ్ల విషయంలో స్పీడ్ పెరిగి.. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా కొత్త రైళ్లు పట్టాల మీదకు ఎక్కుతున్న సంగతి తెలిసిందే.
మొన్నటికి మొన్న సికింద్రాబాద్ – గుంటూరు – విజయవాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను పట్టాల మీదకు తీసుకొచ్చేసిన ప్రభు.. తాజాగా రాయలసీమ.. ఏపీ రాజధానికి కనెక్టివిటీ ఉండేలా కొత్త ట్రైన్ కు ఈ రోజు పచ్చజెండా ఊపనున్నారు. విజయవాడ –ధర్మవరం మధ్యన నడిచే ఈ కొత్త రైలు ప్రస్తుతానికి వారంలో మూడు రోజులు మాత్రమే నడవనుంది.
తాజా ట్రైన్ తో రాయలసీమ వాసులు ఏపీ రాజధానికి చేరుకునేందుకు మరింత సులువుగా ఉంటుందని చెప్పాలి. విజయవాడలో స్టార్ట్ అయ్యే ఈ కొత్త ట్రైన్ ను రిమోట్ సాయంతో ఢిల్లీ నుంచి సురేశ్ ప్రభు స్టార్ట్ చేయనున్నారు. ఈ కొత్త ట్రైన్ తో రాజధాని నగరానికి వచ్చేందుకు రాయలసీమ వాసులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పొచ్చు.