Begin typing your search above and press return to search.
వివాదంలో చిక్కుకున్న రైనా .. బ్రాహ్మిణ్‌నే కామెంట్స్ పై వివాదం
By: Tupaki Desk | 22 July 2021 2:30 PM GMTసురేష్ రైనా ... మాజీ టీమిండియా స్టార్ ఆటగాడు. జట్టులో సభ్యుడిగా కొనసాగినన్ని రోజులు జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తూ , జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఎన్నో సార్లు కీలక ఇన్నింగ్స్ ఆడి ఇండియా కి ఘన విజయాల్ని అందించాడు. ధోనీ కెప్టెన్ గా ఉన్న రోజుల్లో టీమిండియాలో రెగ్యులర్ ఆటగాడిగా రైనా కొనసాగాడు. విరాట్ కోహ్లీ చేతికి టీమిండియా పగ్గాలు రావడంతో ఇతను జట్టుకు క్రమక్రమంగా దూరమయ్యారు. కెప్టెన్ గా కొనసాగిన ధోనీ…రిటైర్ మెంట్ ప్రకటించడంతో..అదే బాటలో రైనా కూడా పయనించాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ కు రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
తమిళనాడు ప్రిమియర్ లీగ్ (టీఎన్ పీఎల్)లో కామెంట్రీ ఇస్తున్న రైనా అక్కడి సంస్కృతి గురించి మాట్లాడుతూ నోరు జారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో ఉన్న రైనాను సహచర కామెంటేటర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు. ఈ సందర్భంగా అతడు చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. నేను కూడా బ్రాహ్మిణ్ నే అని అనుకుంటున్నాను. నేను 2004 నుంచి చెన్నైలో ఆడుతున్నాను. ఇక్కడి సంస్కృతి నాకు ఇష్టం. నా టీమ్ మేట్స్ అంటే కూడా. నేను అనిరుద్ధ శ్రీకాంత్, బద్రినాథ్, బాలాజీలతో కలిసి ఆడాను అని రైనా అన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌లోనూ మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది. మాకు మంచి స్వేచ్ఛ ఇచ్చారు. అక్కడి సంస్కృతి నాకు చాలా బాగా నచ్చుతుంది. సీఎస్కే టీమ్ లో భాగం కావడం సంతోషంగా ఉంది అని రైనా చెప్పాడు. అయితే అతని కామెంట్స్‌పై సోషల్ మీడియా తీవ్రంగా మండిపడింది. చెన్నై అంటే బ్రాహ్మిణ్ లేనా అంటూ నెటిజన్లు అతన్ని ప్రశ్నించారు. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నా.. నువ్వు నిజమైన చెన్నై సంస్కృతిని చూసినట్లు లేవు అంటూ ఓ ట్విటర్ యూజర్ కామెంట్ చేశాడు. రైనా కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు ప్రశ్నిస్తుండగా..ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి అంటూ ఘాటు రిప్లై ఇస్తున్నారు.
సురేశ్ రైనా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2005 సంవత్సరంలో ఇతను భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ 20 మ్యాచ్ లు ఆడారు రైనా. టీ 20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా ఇతనికి పేరు ఉంది. సురేశ్ రైనా.. చివరిగా 2018లో భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. 2005లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సురేశ్ రైనా.. 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లాడాడు. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ పేరొందిన సురేశ్ రైనా.. 2020 టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని ఆశించాడు. కానీ, కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీ 2022కి వాయిదాపడిపోయింది. దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తానని ధీమా వ్యక్తం చేసిన రైనా.. తన కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అదే బాటలో పయనించాడు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి రీస్టార్ట్ కాబోతోంది. అయితే.. 40 ఏళ్ల ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని వార్తలు వస్తుండగా.. ఒకవేళ ధోనీ ఈ ఏడాది ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తే తాను కూడా ఐపీఎల్ కి గుడ్ బై చెప్పేస్తానని సురేశ్ రైనా స్పష్టం చేశాడు. భారత్ జట్టులోనే కాదు.. ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరఫున సుదీర్ఘకాలం ధోనీ, సురేశ్ రైనా కలిసి ఆడారు. వీరి మధ్య స్నేహ బంధం ఎంతలా ఉందంటే..? 2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్ కి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా.. నిమిషాల్లోనే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పేశాడు.
మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడకపోతే..? నేను కూడా ఆడను. 2008 నుంచి మేమిద్దరం కలిసి ఆడుతున్నాం. ఒకవేళ ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ ని చెన్నై సూపర్ కింగ్స్ గెలవగలిగితే.. అప్పుడు ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడేలా ధోనీని నేను ఒప్పిస్తాను. ఐపీఎల్ 2022 సీజన్ లోకి కొత్తగా రెండు జట్లు రాబోతున్నాయి. అయినప్పటికీ నేను చెన్నై తరఫునే ఆడాలని కోరుకుంటున్నాను అని సురేశ్ రైనా ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.