Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : ఐపీఎల్ నుండి సురేష్ రైనా అవుట్ !
By: Tupaki Desk | 29 Aug 2020 10:50 AM GMTఎన్నో అవాంతరాల మధ్య ఎట్టకేలకి ఐపీఎల్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది అని అనుకుంటున్న సమయం లో ఐపీఎల్ కి సంబంధించిన రోజుకొక వార్త వైరల్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2020 లో మోస్ట్ హట్ ఫెవరెట్ గా బరిలో దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. నిన్న కరోనా కలకలంతో ప్రాక్టీస్ కు దూరంకాగా.. నేడు మరో సంచలన వార్త చెన్నై అభిమానులని షాక్ కి గురిచేసింది.
అదేమిటిఅంటే .. భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది. సురేష్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశానికి తిరిగి వచ్చారని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కెఎస్ విశ్వ నాథన్ తెలిపారు. అతను మిగిలిన ఐపిఎల్ సీజన్ లో అందుబాటులో ఉండరని తెలిపారు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ సురేష్ మరియు అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ వార్త చెన్నై టీం కు ఓ పెద్ద చేదు వార్త అని తెలిపారు. యితే రైనా వెనక్కి ఎందుకొచ్చాడన్నదానిపై సీఎస్‌కే స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, ఇటీవలే సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా వచ్చే నెల 17 నుంచి జరుగుతుంది. ఈ టోర్నీ కోసం గానూ ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి. నిన్న చెన్నై ఫాస్ట్ బౌలర్ ఒకరికి కరోనా వచ్చినట్టు నిర్ధారించారు. అలాగే 10 మంది స్టాఫ్ కి కూడా కరోనా సోకిందని నిర్ధారించారు. దీనితో అప్రమత్తం ఐపిఎల్ టీమ్స్ అన్ని కూడా అప్రమత్తం అయ్యాయి.