Begin typing your search above and press return to search.

ఆసక్తికరంగా సురేశ్ రెడ్డి.. కేకే ఆస్తుల లెక్క

By:  Tupaki Desk   |   17 March 2020 3:30 PM GMT
ఆసక్తికరంగా సురేశ్ రెడ్డి.. కేకే ఆస్తుల లెక్క
X
ఆస్తులు ఎన్ని ఉన్నా.. అప్పులేనోళ్లు అస్సలు కనపడరు. ఆ మాటకు వస్తే.. దేవుడికి సైతం అప్పుల తిప్పలు తప్పలేదు. కానీ.. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా అభివర్ణించే కేకే కు రాజ్యసభ సీటును కన్ఫర్మ్ చేసిన వైనం తెలిసిందే. తాజాగా నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

కేకే అలియాస్ కె. కేశవరావుకు అప్పులే లేవన్న విషయాన్ని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. 2018-19లో తన వార్షికఆదాయం రూ.24.47లక్షలుగా పేర్కొన్న కేకే.. తనకు మొత్తం రూ.2.31 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తనకు తన కుటుంబ సభ్యులకు స్థిరాస్తులు రూ.88.96 లక్షలు కాగా.. చరాస్తులు రూ.19.37లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కేకేతో పాటు రాజ్యసభకు వెళుతున్న ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డికి భారీగా ఆస్తులు ఉన్నట్లుగా తేలింది.

తాజాగా ఆయన దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్ లో తనకున్న ఆస్తుల లెక్కను పేర్కొన్నారు. తనకున్న స్థిర.. చరాస్తులు కలిపి ఏకంగా రూ.108.22 కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం రెండు రాజ్యసభ ఖాళీలకు అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా.. శ్రమశక్తి పార్టీ మరో రెండు నామినేషన్లు వేసినప్పటికీ.. అవేవీ సరిగా లేకపోవటం తో వాటినిరిజెక్టు చేశారు. దీంతో.. దాఖలైన నామినేషన్లురెండు మాత్రమే కావటంతో పోటీ లేకుండానే ఏకగ్రీవం కానుంది.