Begin typing your search above and press return to search.

పెరుగుతున్న పెళ్లికి ముందు అమ్మాయిని కన్యగా మార్చే సర్జరీలు

By:  Tupaki Desk   |   16 March 2020 1:30 PM GMT
పెరుగుతున్న పెళ్లికి ముందు అమ్మాయిని కన్యగా మార్చే సర్జరీలు
X
పెళ్లికి ముందు వరకూ ఎవరితోనూ సెక్స్ చేయని కన్య కావాలని పురుషులు ఉబలాటపడుతుంటారు. కానీ ప్రస్తుత సమాజ పోకడలు చూస్తే పదహారేళ్లకే ఆ పని కానిచ్చేస్తున్నారు. పదోతరగతిలోనే తొలి సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారు. అంతటి సమాజం లో కన్యత్వ అమ్మాయి కోసం ఎదురు చూడడం అత్యాశే అవుతుంది. ఇక తొలి సెక్స్ అనుభవాన్ని చూడని అబ్బాయిలను భూతద్దం పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి.

నువ్వు వర్జినా..? ఈ ప్రశ్న ఇప్పటి ఆధునిక యుగంలో అందరి నోటి నుంచి వెలువడుతోంది. కానీ ఈ కాలంలో కన్యత్వం కాపాడుకునేంత పెద్ద టాస్క్ ఇంకోటి లేదు. ఆడ, మగ పెళ్లికి ముందే శృంగారాన్ని అనుభవిస్తూ తమ వర్జినిటీని కోల్పోతున్నారు.

అయితే తమను పెళ్లి చేసుకునే భర్తకు తాము వర్జిన్ గానే కనపడాలని మహిళలు ఉబలాటపడుతున్నారు. ఈ కోవలోనే భారత్ లో ఇప్పుడు కన్యత్వాన్ని తిరిగి తెచ్చుకునే పరీక్షలు పెరిగిపోతున్నాయి. 20-30 ఏళ్ల మధ్య అమ్మాయిలు ఈ కన్యత్వ సర్జరీలు చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. పెళ్లాడే వ్యక్తికి తాము కన్య కాదన్న విషయం తెలియకూడదని ఈ చికిత్స చేసుకుంటున్నారు.

ఢిల్లీ కేంద్రంగా పలు ఆస్పత్రులలో ఈ సర్జరీలు జరుగుతున్నాయి. ప్రముఖ గైనకాలజిస్ట్ లు, ప్లాస్టిక్ సర్జన్స్ ఈ కొత్త రకం చికిత్సను చేస్తున్నారు. ఢిల్లీలో అపోలో ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జన్ అనూప్ ధీర్ ఈ కన్యత్వ సర్జరీలను మొట్టమొదట మొదలుపెట్టాడు.

చాలా మంది పెళ్లికి ముందే తొలిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడే వారు ‘కన్యత్వం’ పోగొట్టుకుంటున్నారు. అలా పోయిన వర్జినీటిని తిరిగి పొందవచ్చని వైద్యులు ఈ కొత్త సర్జరీని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు దేశంలో చాలామంది యువతులు తమ వర్జినిటీ కోల్పోయారని నేషనల్ హెల్త్ సర్వీస్ స్వయంగా వెల్లడించారు.

తాజాగా బ్రిటన్ కు చెందిన మహిళలు సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా ఈ హైమన్ పొర తిరిగి ఏర్పడటం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు. మళ్లీ వర్జిన్ గా చెప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దేశంలోనూ ఇప్పుడు ఉత్తర భారతంలో ముఖ్యంగా ఢిల్లీలో ఈ సర్జరీలు పెరిగిపోయాయి. హర్యానా అమ్మాయిలు, ముస్లిం, మిడిల్ ఈస్ట్ దేశాల అమ్మాయిలు ఎక్కువ గా ఈ సర్జరీ చేయించుకుంటున్నారట.. ఈ సర్జరీ లో హైమెన్ పొరను తిరిగి ఏర్పడేలా చేస్తారు. కుట్ల ద్వారా తిరిగి ఏర్పడేలా డాక్టర్లు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ తో మహిళలు తిరిగి వర్జినిటీని పొందుతున్నారట.. కాబోయే భర్తలను కూడా తాము వర్జిన్ లమని ‘సంతృప్తి’ పరుచుతుడడం విశేషం.

అరగంట సమయం పట్టే ఈ ఆపరేషన్ ఖరీదు అయ్యరాల 50వేల నుంచి 70వేల వరకు ఉంటుంది.. ఇలా దేశంలో సర్జరీలు చేయించుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోందట.